విడాకులు తీసుకుంటున్న వారిలో బౌద్ధ మహిళలే అధికం...
03-01-2018 11:40:38
న్యూఢిల్లీ : దేశంలో విడాకులు తీసుకుంటున్న వివాహితల్లో బౌద్ధ మహిళలే అధికంగా ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. 2011 జనాభా గణన ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యిమంది బౌద్ధ వివాహితుల్లో 12 మంది తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారని తేలింది. మతాల వారీగా చూస్తే క్రైస్తవులు, హిందువుల్లో ఎక్కువ మంది వివాహితలు తమ భర్తల నుంచి దూరంగా ఉంటున్నారని సర్వేలో వెలుగుచూసింది. విడాకులు పొందిన వారిలో బౌద్ధ మహిళలు 12 శాతం మంది ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో క్రైస్తవులు 11,9 శాతం మంది, హిందూ మహిళలు 6.9 శాతం, ముస్లిమ్ మహిళలు 6.7 శాతం మందని తేలింది. సిక్కు వివాహితుల్లో 4.1 శాతం మంది, జైనుల్లో 3.6 శాతం మంది విడాకులు తీసుకున్నారని గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద విడాకులు తీసుకున్న వారిలో పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉండటం విశేషం. దేశంలో భర్తల నుంచి విడాకులు పొందిన మహిళల్లో మతాల వారీగా చూస్తే హిందూ మహిళలు అత్యధికంగా 25.2 లక్షలమంది ఉన్నారు. దేశంలో 5 లక్షల మంది ముస్లిమ్ మహిళలు, 1.3 లక్షల మంది క్రైస్తవ మహిళలు విడాకులు తీసుకున్నారని జనాభా గణాంకాలు తేటతెల్లం చేశాయి.

No comments:
Post a Comment