Sunday 28 January 2018

నేడు సూర్య నమస్కారాలు

నేడు సూర్య నమస్కారాలు
28-01-2018 01:16:10
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రకృతి ఆరాధనతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ‘సూర్య నమస్కారం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రథ సప్తమి తర్వాత వచ్చే ఆదివారం చాలా మంచిదంటారని, అందుకే ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వర్తించే ‘సూర్య వందనం’లో తాను కూడా పాల్గొంటున్నానని చెప్పారు. సూర్యుడు జస్టిస్‌ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు.

బీద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్‌ వస్తుందని అన్నారు. ‘శ్రీ సూర్యదేవ శుభవందనం’ అనే గీతాన్ని, యోగా గురువు మాధవరావు రాసిన ‘చంద్రయోగం’ పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు.

No comments:

Post a Comment