నా బిడ్డను హింసించి చంపారు
Posted On: Friday,January 12,2018
http://www.prajasakti.com/Article/Guntur/2000422
ప్రజాశక్తి-వినుకండ రూరల్
బాలికను ప్రేమ పేరుతో వంచించి, పెళ్లిపేరుతో మోసం చేసి పది నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచి చివరకు మృత్యువుకు గురి చేసిన దారుణ సంఘటన మండలంలోని పెదకంచర్ల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గుట్టు చప్పుడు కాకుండా బాలిక మృతికి కారణమైన యువకుడు, అతని కుటుంబసభ్యులు మృత దేహానికి అంత్యక్రియలు చేయడానికి చేసిన ప్రయత్నం బాలిక తల్లిదండ్రులు రావడంతో బట్టబయలైంది. పది నెలల క్రితం ఆదృశ్యమైన తమ చిట్టితల్లి శవపేటికలో కనిపించేసరికి తల్లి,దండ్రుల భాధ వర్ణనాతీతంగా మారింది. కన్న కూతుర్ని కళ్లముందే తీసుకెళ్లి గృహనిర్భందం చేసినా, పోరాడే శక్తి లేక బతికి ఉంటుందన్న తల్లిదండ్రుల ఆశల అడియాశలయ్యాయి.
మృతురాలి తండ్రి సుభానీ కథనం ప్రకారం పెదకంచర్ల గ్రామానికి చెందిన షేక్ సుభానీ, మౌలాబీ దంపతుల చిన్న కుమార్తె షేక్ సుభాన్‌బీ(16) గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతుంది. అదే గ్రామానికి చెందిన సోమేపల్లి వీరాంజనేయులు ప్రేమ పేరుతో సుభాన్‌బీని నమ్మించాడు. పెళ్లిపేరుతో ఆమెను ఇంటి నుండి తీసుకెళ్లాడు. అప్పట్నుంచి ఆమె కుటుంబ సభ్యులు సుభాన్‌బీ ఆచూకి కోసం గాలించి చివరకు ఆంజనేయులు వద్ద ఉన్నట్లు గుర్తించారు. తన కుమార్తె సుభాన్‌బీని పెళ్లాడతానని నమ్మబలికిన వీరాంజనేయులు కాలం గడుపుతూ వచ్చాడని, ఈ నేపథ్యంలో కొంత కాలంగా తన కుమార్తెను వేధించసాగారన్నారు. అనారోగ్యంతో బాధపడుతుందంటూ గత నాలుగు రోజుల క్రితం గుంటూరుకు తరలించినట్లు సమాచారం తెలిసిందని, బుధవారం సోమేపల్లి వీరాంజనేయులు ఇంటి వద్ద దర్శనమిచ్చిన శవపేటికను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా ప్రాంతానికి వెళ్లి చూడగా తన కుమార్తె సుభాన్‌బీ మృతదేహంగా గుర్తించడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున మృతదేహం వద్దకు చేరుకొని బోరున విలపించారు. అమాయకురాలైన తన కుమార్తె సుభాన్‌బీ జీవితంతో చెలగాటమాడి, చివరకు ఆమె మృతికి కారకులైన వీరాంజనేయులు, అతని సోదరుడు నాగేశ్వరరావు, తండ్రి గోవిందు, గోవిందు భార్యలపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రహస్యంగా అంత్యక్రియలు
బుధవారం రాత్రి మృతి చెందిన మైనర్ సుభాన్‌బీ మృతదేహాన్ని రహస్యంగా హిందూ శాస్త్ర ప్రకారం దహనం చేసేందుకు సోమేపల్లి వీరాంజనేయులు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి శవ దహనాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు. అర్ధరాత్రి శవం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పోలీసుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు శవపంచనామా నిర్వహించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి : ఇన్సాఫ్
సుభాన్‌బీ అనే మైనర్ అక్రమ నిర్బంధం, హత్యా సంఘటనకు పాల్పడిన నింధితులైన సోమేపల్లి వీరాంజనేయులు, నాగేశ్వరరావు, తల్లిదండ్రులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఇన్సాఫ్ నియోజకవర్గ కార్యదర్శి షేక్ శిలార్, అక్బర్ బాషా, కరిముల్లా ఖాన్, సైదావలి, అఫీజుల్లాఖాన్, కొండ్రముట్ల వలిలు డిమాండ్ చేశారు. మైనర్ బాలిక, విద్యార్థినీ పట్ల రాక్షసంగా ప్రవర్తించడం తీవ్ర నేరమని, ఈ చర్యలకు పాల్పడిన నిందితులపై కిడ్పాప్, అత్యాచార, హత్యా నేరాలపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కొత్త సంవత్సరం కానుక మౌజన్ !
సంక్రాంతి కానుక షేక్ సుభాన్‌బీ !
జిల్లామంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల అనుమతులు వచ్చాకే పోలీసులు కేసు కడతారా?
ఈ ఫొటో చూసి కూడా గుంటూరు పోలీసులకు కేసు కట్టాలనిపించలేదా?
మానవతావాదులు నోరు తెరవండి!
కోళ్లపందాలు వద్దాన్నారు సరే !
పెద కంచర్లలో మనిషినే చంపేశారు !!
ఏపీలో ముస్లింల కోసం
జైళ్ళు తప్ప, పోలీసులు, న్యాయస్థానాలూ లేవా?
ఒక్క నిజం చెప్పండి !
ఎంతమంది ముస్లింలని చంపేసి
మళ్ళీ ఢిల్లీకి రమ్మన్నారూ?
ఎంతమందిని చంపుతారూ?
అప్పుడు ఆయేషామీరా !
ఇప్పుడు షేక్ సుభాన్‌బీ !
దళిత, బహుజన, ఆదివాసి, మత మైనారిటీ, ప్రజాస్వామికవాదులు ఏకంకావాలి!
వారు ఢిల్లీ నుండి ఏపికీ స్పెషల్ ప్యాకేజీ తేలేదు!
ఏపి ముస్లింల కోసం స్పెషల్ ప్యాకేజీ తెచ్చారు!
ఆంధ్రప్రదేశ్ లో
ముస్లింల గోడు వినడానికి
ఒక్కమంత్రి అయినా వున్నాడా?
ఏం జరుగుతోందీ ఏపీలో?
రాజమండ్రిలో మౌజన్ హత్య
వినుకొండలో ముస్లిం వివాహిత హత్య
నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి
నన్నపనేని రాజకుమారి
నా బిడ్డను హింసించి చంపారు.
దళితులు, ముస్లింలు కలిసి
'చలో పెద కంచర్ల'
కార్యక్రమాన్ని నిర్వహించాలి.

No comments:
Post a Comment