Thursday, 25 January 2018

‘ముస్లింలు, దళితులను చంపినవాళ్ళు ఇప్పుడు పిల్లలపై ...’

‘ముస్లింలు, దళితులను చంపినవాళ్ళు ఇప్పుడు పిల్లలపై ...’ 
25-01-2018 16:12:06

న్యూఢిల్లీ : గురుగ్రామ్‌లో స్కూల్ బస్సుపై ‘పద్మావత్’ నిరసనకారుల  దాడిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ముస్లింలను చంపి, దళితులను సజీవ దహనం చేసినవాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళల్లోకి దూరి, మన పిల్లల వెంట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలంటివారికి వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఇటువంటి దాడుల విషయంలో మౌనంగా ఉండకూడదన్నారు.

‘‘నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఎంత మాత్రం మౌనంగా ఉండకూడదు. వాళ్ళు ముస్లింలను చంపారు, దళితులను సజీవ దహనం చేశారు, కొట్టారు. ఈరోజు, వాళ్ళు మన పిల్లలను రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు, మన ఇళ్ళల్లోకి చొరబడటం మొదలుపెట్టారు. మౌనంగా ఉండకండి, మాట్లాడండి’’ అని కేజ్రీవాల్ అన్నారు. విభజించేవారికి వ్యతిరేకంగా మాట్లాడటం తప్పనిసరి అన్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఉత్తర ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

No comments:

Post a Comment