Thursday 25 January 2018

కోటప్పకొండపై శిలువ, చంద్రవంక ఏర్పాటు.. భక్తుల కన్నెర్ర

కోటప్పకొండపై శిలువ, చంద్రవంక ఏర్పాటు.. భక్తుల కన్నెర్ర
25-01-2018 19:11:20

గుంటూరు: పవిత్రమైన శైవక్షేత్రం కోటప్పకొండపై శిలువ, చంద్రవంక ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కొటప్పకొండ పర్యాటక అభివృద్ధి ఘాట్ రోడ్‌లో హిందూ-ముస్లిం-క్రైస్తవ మత సామరస్య ప్రతిమలు ఏర్పాటు చేయడాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మత సామరస్యం పేరుతో అన్యమత చిహ్నాలను పెట్టడాన్ని సహించబోమని తాళ్ళాయపాలెం శివ స్వామి హెచ్చరించారు. తక్షణమే సిలువ, చంద్రవంకలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంత మత సామరస్యం ప్రదర్శించాలనుకుంటే ప్రజాప్రతినిధులు తమ ఇళ్లలో ప్రదర్శించుకోవాలని, హిందూ దేవాలయాల్లో కాదని శివస్వామి హెచ్చరించారు.
అంత మతసామరస్యం కోసం తాపత్రాయపడుతుంటే ముందుగా చర్చి, మసీదుల్లో హిందూ దేవుళ్ళను ప్రతిష్టించాలని ఆయన సూచించారు. కోటప్పకొండపై అన్యమత చిహ్నాలను ఏర్పాటు చేయడం క్షమించరాని నేరమన్నారు. తక్షణమే సిలువ, చంద్రవంకలను తొలగించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని శివస్వామి హెచ్చరించారు. మత సామరస్యమని పైకి చెబుతూ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ కుట్ర ప్రజాప్రతినిధులు చేస్తున్నారని, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని శివస్వామి హెచ్చరించారు. వెంటనే అన్యమత చిహ్నాలను తొలగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment