కమలం గూటికి ఇష్రత్ జహాన్
02-01-2018 01:02:03
మోదీని ప్రశంసించిన తలాక్ ఉద్యమకారిణి
న్యూఢిల్లీ, జనవరి 1: తక్షణ ట్రిపుల్ తలాక్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేసిన ఇష్రత్ జహాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇష్రత్.. ఆదివారం బీజేపీలో చేరినట్టు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు సోమవారం వెల్లడించారు. హౌరాలోని పార్టీ కార్యాయానికి వచ్చిన ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారని తెలిపారు. ఆమె చేరికను పురస్కరించుకుని త్వరలోనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఇక, ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం తాను జిల్లాల పర్యటనలో ఉన్నానని, త్వరలోనే హౌరా వెళ్లి.. ఇష్రత్ చేరికను పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఐదుగురిలో ఇష్రత్ ఒకరు.
కాగా, ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఇష్రత్.. బెంగాల్ సీఎం మమతపై విమర్శలు గుప్పించారు. ’నేను బెంగాల్‌కి చెందిన వ్యక్తిని. మా రాష్ర్టాన్ని ఓ మహిళ పాలిస్తున్నారు. అయినప్పటికీ మాకు అండగా నిలవలేకపోయారు. నేను ఒంటరిగానే పోరాడాను. అధికార పార్టీ, సీఎం నుంచి కానీ నాకు ఎలాంటి మద్దతూ లభించలేదు’ అని విమర్శించారు. ముస్లిం మహిళలకు అండగా నిలిచిన ప్రధాని మోదీకి ఇష్రత్ ధన్యవాదాలు తెలిపారు.

No comments:
Post a Comment