Saturday, 3 February 2018

ప‌ద్మావ‌త్‌పై క‌ర్ణిసేన ప్ర‌శంస‌లు!

ప‌ద్మావ‌త్‌పై క‌ర్ణిసేన ప్ర‌శంస‌లు! 
Updated : 03-Feb-2018 : 12:16

నిన్నటివ‌ర‌కు `ప‌ద్మావ‌త్`ను తీసిన సంజ‌య్ లీలా భ‌న్సాలీని, న‌టించిన దీపికా ప‌దుకొనేల‌ను చంపేస్తామ‌ని బెదిరించిన క‌ర్ణిసేన ఆందోళ‌న‌కారులు యూట‌ర్న్ తీసుకున్నారు. `ప‌ద్మావ‌త్‌` సినిమా విడుద‌లైతే ఆత్మాహుతి చేసుకుంటామ‌ని హెచ్చ‌రించిన వారు..ఆ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. శుక్ర‌వారంనాడు ఈ సినిమాను ముంబైలో కొంత‌మంది క‌ర్ణిసేన సైనికులు చూశారు. అనంత‌రం ఈ సినిమాపై త‌మ ఆందోళ‌న‌ల‌ను విర‌మించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

`సినిమాలో రాణి ప‌ద్మినీ, అల్లావుద్దీన్ ఖిల్జీల మ‌ధ్య అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలేం లేవు. నిజానికి ఈ సినిమాలో రాజ్‌పుత్‌ల చ‌రిత్ర‌ను చాలా గొప్ప‌గా చూపించారు. `ప‌ద్మావ‌త్‌` చూశాక ప్ర‌తీ రాజ్‌పుత్ గ‌ర్వ‌ప‌డ‌తాడు. అందుకే ఆందోళ‌న‌ల‌ను విర‌మిస్తున్నాం. రాజ‌స్తాన్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో కూడా ఈ సినిమా విడుద‌ల‌కు స‌హాయప‌డ‌తామ‌`ని క‌ర్ణిసేన ముంబై అధ్యక్షుడు యోగేంద్ర క‌టార్ మీడియాకు వెల్ల‌డించారు.

No comments:

Post a Comment