మహిళల 'ఖత్నా' వెనుక కఠోర వాస్తవాలు
సింధువాసిని
బీబీసీ ప్రతినిధి
https://www.bbc.com/telugu/india-42973920
ఇన్సియా
బలవంతంగా ఎవరైనా మీ శరీర భాగాన్ని కోస్తే... దాన్ని సమర్థించగలరా? కానీ, భారత్‌తో సహా చాలా దేశాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
పుణెకు చెందిన నిష్రిన్ సైఫ్ ఇలాంటి బాధితురాలే.
''అప్పుడు నాకు ఏడేళ్లు. ఏం జరిగిందో సరిగ్గా గుర్తుకు లేదు. కానీ, లీలామాత్రంగా నాటి ఘటన మదిలో నిలిచిపోయింది'' అని తనకు 'సున్తీ' లేదా 'ఖత్నా' జరిగిన విషయాన్ని నిష్రిన్ సైఫ్ గుర్తు చేసుకున్నారు.
''అమ్మ, నన్ను ఓ చిన్న గదికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ఓ మహిళ కూర్చొని ఉంది. ఆమె నా పైజామాను తొలగించింది,'' అని చెప్పారు.
ట్రిపుల్ తలాక్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 4 విషయాలు
భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న మహిళల పోరాటం
సున్తీ, ఖత్నా, మహిళలుImage copyrightGETTY IMAGES
చిత్రం శీర్షిక
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో 'ఖత్నా' ఆచారం
''ఆ సమయంలో నాకు పెద్దగా నొప్పి లేదు. ఏదో సూదితో గుచ్చినట్లు అనిపించిందంతే. కానీ, కొద్దిసేపయ్యాక భరించలేనంత నొప్పి. చాలా రోజులు మూత్రం పోయిడానికి కూడా ఇబ్బందిపడ్డా''నని ఆమె తెలిపారు.
నిష్రిన్ పెరిగి పెద్దాయ్యాక తాను ఏం కోల్పోయిందో తెలుసుకుంది.
సాధారణంగా పురుషులకు సున్తీ చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో మహిళలు కూడా ఇదే విధంగా బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి. బొహ్రా ముస్లిం సమాజం (దావూదీ బొహ్రా, సులైమానీ బొహ్రా)లో ఇది సర్వ సాధారణం.
గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో బొహ్రా ముస్లింలు ఎక్కువ. దేశంలో వీరి జనాభా దాదాపు 10 లక్షల దాకా ఉంటుంది.
వీరిలో దావూదీ బొహ్రా ముస్లింలు దేశంలోని విద్యావంతమైన ముస్లిం సమాజాల్లో ఒకటి. నిష్రిన్ సైఫ్ కూడా ఇదే తెగకు చెందినవారు. అందువల్లే ఆమెకు చిన్నప్పుడే 'ఖత్నా' చేయించారు.
బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?

మహిళల్లో 'ఖత్నా' అంటే ఏమిటి?
'ఖత్నా' చేయడం అంటే మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం. దీన్నే ఆంగ్లంలో 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా వ్యవహరిస్తున్నారు.
''స్త్రీ జననేంద్రియంలో వెలుపలి భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని ఎఫ్‌జీఎంగా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది.
ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పరిగణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది.
ఎఫ్‌జీఎంను నిర్మూలించేందుకు, దీనిపై చైతన్యం కలిగించేందుకు ప్రతి యేటా ఫిబ్రవరి 6ను 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్‌జీఎం'గా జరుపుకోవాలని ప్రకటించింది.
‘ముస్లింలపై దాడులను అడ్డుకోవడంలో భారత్ విఫలం’
#HerChoice: భర్త వదిలేశాక, నాతో నేను ప్రేమలో పడ్డాను సరికొత్తగా!

బొహ్రా ముస్లింలు
ఊహ తెలియని వయసులోనే అంటే ఆరు, ఏడేళ్లప్పుడే అమ్మాయిలకు 'ఖత్నా' చేస్తారు. ఈ విధానం కూడా అనేక రకాలుగా ఉంటుంది.
యోని శీర్షం వెలుపలి భాగాన్ని కోసి వేయడం, లేదా అక్కడి చర్మాన్ని తొలగించడం 'ఖత్నా'లో భాగమే. 'ఖత్నా' చేస్తున్నప్పుడు కనీసం మత్తు మందు కూడా ఇవ్వరు. పూర్తి స్పృహలో ఉన్నప్పుడే అమ్మాయిలు తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది.
బ్లేడ్, కత్తి ఉపయోగించి నాటు పద్ధతిలో 'ఖత్నా' చేస్తుంటారు. ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, వేడి నీళ్లు, సాధారణ పైపూత మందును వాడుతారు.
'''క్లైటోరిస్'ను తమ సమాజంలో మాంసపు ముక్కగా పిలుస్తారు'' అని బొహ్రా ముస్లిం సమాజానికి చెందిన ఇన్సియా దరివాలా పేర్కొన్నారు. క్లైటోరిస్ ఉండడం వల్ల అమ్మాయిల్లో లైంగికవాంఛ పెరుగుతుందని బొహ్రా ముస్లింలు భావిస్తుంటారు.
''క్లైటోరిస్ తొలగిస్తే అమ్మాయిల్లో లైంగికవాంఛ తగ్గుతుందని, అప్పుడు పెళ్లికి ముందు సెక్స్‌కు తహతహలాడరని భావిస్తుంటారు'' అని ఇన్సియా దరివాలా చెప్పారు.
#HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
#HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'
ఖత్నా, సున్తీImage copyrightGETTY IMAGES
చిత్రం శీర్షిక
ప్రతీకాత్మక చిత్రం
మోసపూరితంగా 'ఖత్నా'
ఇన్సియా అదృష్టవంతురాలు. ఈ నొప్పి నుంచి ఆమెను తల్లి తప్పించింది. ''అమ్మ నన్ను రక్షించింది. కానీ, మా అక్క విషయంలో మాత్రం సాధ్యం కాలేదు. మా కుటుంబంలోని ఓ మహిళ సినిమా చూపిస్తానని చెప్పి అక్కను తీసుకెళ్లి 'ఖత్నా' చేయించింది.'' అని ఇన్సియా తెలిపారు.
ఇన్సియా తల్లి క్రిస్టియన్. 'ఖత్నా' గురించి ఆమెకు పెద్దగా తెలియదు.
ఆమె పెద్ద కూతురుకు ఇంట్లో వాళ్లు మోసపూరితంగా సున్తీ చేయించారు. ఆ సమయంలో కూతురు పడిన బాధను చూసిన ఆమె, ఇన్సియాకు ఆ పరిస్థితి ఎదురుకావొద్దని నిర్ణయించుకున్నారు.
''మొదట్లో ఇంట్లో వాళ్లు మా అమ్మను కోప్పడ్డారు. తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. అక్క పడిన బాధను నేను ప్రత్యక్షంగా చూశా''నని ఇన్సియా అన్నారు.
40 ఏళ్ల నిష్రిన్‌కు ఇద్దరు కూతుళ్లు. ఆమె కూడా తన బిడ్డలకు 'ఖత్నా' చేయించకూడదని నిర్ణయించుకున్నారు. ''ఇది కూడా చిన్నారులపై వేధింపులలాంటిదే. నాకు 'ఖత్నా' చేశారు. ఈ పరిస్థితి నా కూతుళ్లకు రావొద్దు'' అని ఆమె బీబీసీకి చెప్పారు.
''వ్యక్తిగత పరిశుభ్రత కోసమే 'ఖత్నా' చేస్తారని చెప్పేవారు. కానీ, దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు అని తెలిసి వచ్చింది'' అని నిష్రిన్ పేర్కొన్నారు. ''మహిళలకు 'ఖత్నా' విషయంలో మా వాళ్లు అభిప్రాయాలు మార్చుకుంటూనే ఉన్నారు. మొదట్లో శుభ్రత కోసమే సున్తీ చేస్తారని చెప్పేవాళ్లు. తర్వాత లైంగికవాంఛను తగ్గించేందుకు అన్నారు. దానిపై వ్యతిరేకత రావడంతో ఇప్పుడేమో లైంగికవాంఛను పెంచేందుకు సున్తీ చేస్తారని అంటున్నారు'' అని ఇన్సియా వివరించారు.
''ఒక వేళ నిజంగా లైంగిక వాంఛను పెంచేందుకు 'ఖత్నా' చేస్తే, ఓ ఏడేళ్ల చిన్నారికి ఏ ఉద్దేశంతో అలా చేయిస్తున్నారు? చిన్నారిల్లో లైంగికవాంఛను పెంచడంలో అర్థం ఏంటి? మమ్మల్ని పిచ్చివాళ్లను చేసేందుకు ఇలా చెబుతున్నారని తెలుసు." అని ఆమె అభిప్రాయపడ్డారు.
'''ఖత్నా' విషయంలో ఇలాంటి నమ్మకాలన్నీ అబద్ధం. ఇది మహిళల జీవితం మీద ప్రభావం చూపుతుంది'' అని భారత్‌లో ఎఫ్‌జీఎంకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న మసూమా రనాల్వి అన్నారు.
పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
#HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
సున్తీ, ఖత్నా, మహిళలుImage copyrightMASOOMA RANALVI/FACEBOOK
చిత్రం శీర్షిక
మసూమా రనాల్వి
మహిళల జీవితం
''ఈ ప్రక్రియ భౌతికంగానే కాదు, మానసికంగానూ మహిళల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. సెక్స్‌ను ఆస్వాదించలేరు'' అని రనాల్వి తెలిపారు.
'''ఖత్నా' తర్వాత అమ్మాయిలు ఎవరినీ నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఇంట్లో వాళ్లే మోసపూరితంగా సున్తీ చేయించడంతో వారిని కూడా నమ్మరు'' అని నిష్రిన్ అంటున్నారు.
సహీవో, వీ స్పీక్ అవుట్ తదితర స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో ఎఫ్‌జీఎంను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. మహిళలకు 'ఖత్నా' చేయడాన్ని ఆస్ట్రేలియా, కెనెడా, బెల్జియం, యూకే, అమెరికా, స్వీడన్, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలు నేరంగా పరిగణిస్తున్నాయి.
మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
#MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?

భారత్‌లో ఎందుకు నిషేధం లేదు?
ఎఫ్‌జీఎంపై నిషేధం విధించాలని వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు దీనిపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలంటూ మహిళా శిశు మంత్రిత్వ శాఖను కోరింది.
అయితే, ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో)లో 'ఖత్నా'కి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అందువల్లే ఇలాంటి విషయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందని మంత్రిత్వ శాఖ సుప్రీంకు తెలిపింది.
''ఎఫ్‌జీఎంను భారత్‌లో నేరంగానే పరిగణించనపుడు, ఎన్‌సీఆర్‌బీ గణాంకాల్లో ఈ నేరాల సంఖ్య లభ్యమవుతుందని ప్రభుత్వం ఎలా భావిస్తోందో నాకు అర్థం కావడం లేదు'' అని వీ స్పీక్ అవుట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మసూమా రనల్వీ వాదిస్తున్నారు.
ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
#BollywoodSexism నేను ఫెమినిస్టునని చెప్పగానే అంతా అదిరిపడ్డారు: సోనమ్ కపూర్

''చాలా చిన్న వయసులోనే 'ఖత్నా' చేస్తున్నారు. ఆ సమయంలో వారికి ఏమీ తెలియదు. అలాంటప్పుడు తమకు జరిగిన అన్యాయాన్ని వారు పోలీసులకు ఎలా చెప్పగలరు? ఇంట్లోవాళ్లే 'ఖత్నా' చేయించడానికి తీసుకెళ్తారు. అప్పుడు ఈ విషయం బయటకి ఎలా తెలుస్తుంది?'' అని మసూమా చెప్పారు.
''మహిళల్లో 'ఖత్నా' పద్ధతి కొనసాగిస్తున్న బొహ్రా సమాజంపై ప్రభుత్వం పరిశీలన జరపాలి. అలాగే ఈ పద్ధతిపై పోరాడుతనన్న వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి'' అని ఇన్సియా సూచించారు.

'వైద్యులూ భాగం అవుతున్నారు'
''బొహ్రా సమాజ పెద్దలతోనూ ప్రభుత్వం చర్చించాలి. వారిని భాగస్వాములు చేయకుండా ఈ అమానవీయ సంప్రదాయాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు'' అని ఇన్సియా అన్నారు.
''ఇప్పుడు ఓ కొత్త ధోరణి కనిపిస్తోంది. బొహ్రా సమాజంలోని ఉన్నత విద్యావంతులు, సంపన్నులు తమ కూతుళ్లను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి 'ఖత్నా' చేయిస్తున్నారు. 'ఖత్నా' చేయడం వైద్యంలో భాగం కాదు. డాక్టర్లకు కూడా దీనిపై అవగాహన లేదు. డబ్బు కోసం వాళ్లు కూడా 'ఖత్నా' చేస్తున్నారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది'' అని అమె చెప్పారు.
‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
‘మీ బిడ్డకు పాలిస్తా.. నా బిడ్డను బతికించండి..!’
సున్తీ, ఖత్నా, మహిళలుImage copyrightAFP
చిత్రం శీర్షిక
ప్రతీకాత్మక చిత్రం
దీనిపై చర్య తీసుకోవాలంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మసూమా లేఖ కూడా రాశారు. అయితే, వారి నుంచి ఇప్పటి వరకు ఆమెకు సమాధానం రాలేదు.
''ఎఫ్‌జీఎంను నిషేధించాలంటే డాక్టర్ల చేయూత అవసరం. లింగ నిర్ధరణ పరీక్షను నేరంగా పరిగణించినట్లే దీన్ని నేరంగా చూసే పరిస్థితి రావాలి'' ఇన్సియా పేర్కొన్నారు.

No comments:
Post a Comment