తాతల ఆస్తిపై పెళ్లికాని కుమార్తెలకు హక్కు...అసెంబ్లీలో కొత్తగా బిల్లు
08-02-2018 11:39:23
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తండ్రిని కోల్పోయిన కూతుళ్లకు తాత ఆస్తిపై హక్కు ఉండేలా రెవెన్యూ కోడ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. తండ్రి మరణించిన పెళ్లికాని కూతుళ్లకు తాత ఆస్తిపై హక్కు కల్పించేలా యూపీ రెవెన్యూకోడ్ సవరణ బిల్లును క్లాజ్ 108, 110 ల ప్రకారం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం ప్రకటించారు. ఈ బిల్లుకు యూపీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించిందని సీఎం వివరించారు. బడ్జెట్ సెషన్ సందర్భంగా ఈ బిల్లు ప్రవేశపెడతామని సీఎం వివరించారు.

No comments:
Post a Comment