Thursday, 8 February 2018

హనుమాన్‌ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న ముస్లిం

హనుమాన్‌ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న ముస్లిం
08-02-2018 03:44:49

గుజరాత్‌లో హిందూ-ముస్లిం ఐకమత్యానికి ప్రతీక
పరమత సహనం ఈ మట్టి గొప్పతనం! మనిషితనమే నిజమైన మతమని ఈ దేశ ప్రజలు ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మొయిన్‌ మెమన్‌ మరోసారి ఈ విషయాన్ని నిరూపించారు. ముస్లిం అయినప్పటికీ.. మిర్జాపూర్‌ ప్రాంతంలోని 500 ఏళ్ల నాటి చారిత్రక హనుమాన్‌ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. ‘నేను రోజూ ఐదుసార్లు నమాజ్‌ చేస్తాను. ఈ ఆలయ వైభవాన్ని నా చిన్నతనంలో చూశా. ఇప్పుడు ఈ ఆలయం వైపు నుంచి వెళ్తుంటే బాధ కల్గుతుంది. అందుకే పూజారిని సంప్రదించి ఆధునీకరణ పనులు మొదలుపెట్టా’ మెమన్‌ చెబుతున్నారు. ఆలయ గోడలకు కాషాయ రంగు టైల్స్‌ వేయిస్తున్నారు. హిందూ-ముస్లిం సోదర భావానికి, ఐకమత్యానికి ఈ హనుమాన్‌ ఆలయం నిదర్శనంగా నిలుస్తుంది అని గుజరాతీలు పొంగిపోతున్నారు.

No comments:

Post a Comment