Wednesday, 7 February 2018

బీజేపీ ఎంపీ వినయ్ ఆరిపోయే దీపం లాంటివాడు... అసదుద్దీన్ వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ వినయ్ ఆరిపోయే దీపం లాంటివాడు... అసదుద్దీన్ వ్యాఖ్యలు
08-02-2018 08:01:33

హైదరాబాద్ :ముస్లింలు భారత్‌లో నివసించకూడదని వారు పాకిస్థాన్‌ లేదా బంగ్లాదేశ్‌ కు వెళ్లిపోవాలని బీజేపీ ఎంపీ వినయ్‌ కటియార్‌ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రతి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న నేపథ్యంలో ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఒవైసీ ఆరోపించారు. ‘ఆరిపోయే దీపం ఎక్కువగా వెలుగుతున్న’ చందంగా వినయ్ వ్యవహారశైలి ఉందన్నారు. దేశంలో ముస్లిముల దేశభక్తిని శంకించొద్దని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. దేశ విభజన ఎలా జరిగినా ఏకీకరణతో మన దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారతీయ ముస్లిములను ‘పాకిస్థానీ’ అంటే కేసు పెట్టేలా చట్టం తీసుకురావాలని ఒవైసీ పునరుద్ఘాటించారు.

No comments:

Post a Comment