Saturday, 3 February 2018

యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
03-02-2018 10:58:36

రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునే ముస్లిములు దేశం నుంచి వెళ్లిపోండి...
ఫైజాబాద్ : యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీంరిజ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వ్యతిరేకించే ముస్లిములు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లిపోవాలని సూచించి దేశంలో సంచలనం రేపారు. రిజ్వీ రామజన్మభూమి పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ను కలిసిన అనంతరం శుక్రవారం ప్రార్థనలు చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాబ్రీ మసీదును నిర్మించాలని కోరేవారికి భారతదేశంలో ఉండే అర్హత లేదని వారు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లకు వెళ్లిపోవాలని రిజ్వీ కోరారు. మసీదు పేరిట జిహాద్ చేసే వారు ఐఎస్ఐఎస్ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదిని కలిసి ఆయన ఉగ్రసంస్థల్లో చేరాలని కోరారు. మతకలహాలు పెచ్చరిల్లేలా వ్యాఖ్యలు చేస్తున్న రిజ్వీని అరెస్టు చేయాలని ముస్లిమ్ లు డిమాండు చేశారు. రిజ్వీ వక్ఫ్ ఆస్తులను అక్రమంగా కబ్జా చేశాడని అతనో నేరస్థుడని షియా ఉలేమా కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా ఇఫ్తేకార్ హుస్సేన్ ఆరోపించారు.

No comments:

Post a Comment