Tuesday 28 November 2017

నా భర్తతో ఉండాలనుకుంటున్నా .. 'లవ్‌ జిహాద్‌' కేసు!

నా భర్తతో ఉండాలనుకుంటున్నా .. 'లవ్‌ జిహాద్‌' కేసు!


- నాకు స్వేచ్ఛ కావాలి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన హదియా
న్యూఢిల్లీ : 'లవ్‌' జిహాద్‌ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న కేరళ మహిళ హదియా కేసు కొత్తమలుపు తిరిగింది. 'నేను నా భర్తతో ఉండాలనుకుంటున్నాను. నాకు స్వేచ్ఛ కావాలి' అని ఆమె అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్‌ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్‌ అలియాస్‌ హదియా కేసు సోమవారం న్యాయస్థానం విచారణకు రాగా ఆమె కోర్టులో పై వ్యాఖ్యలు చేసింది. ఈ సంద ర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హదియ కేసు ఓ అసాధారణమైనదని, హదియా వాంగ్మూలంపై ఇప్పుడికిప్పుడే నిర్ణయానికి రాలేమని కోర్టు పేర్కొంది. మీకేం కావాలని విచారణకు హాజరైన హదియాను ఉన్నత న్యాయస్థానం తొలుత ప్రశ్నించింది. తనకు స్వేచ్ఛ కావాలని ఆమె సమాధానం ఇచ్చింది. మెడిసన్‌ పూర్తి చేసి, డాక్టర్‌ను కావాలనుకుంటు న్నట్టు ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో ఆమె తన చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిం చింది. అలాగే తమిళనాడు సేలంలోని హోమియోపతి కళాశాల డీన్‌ను ఆమెకు గార్డియన్‌గా నియమిస్తూ, ఆమెకు హాస్టల్‌ వసతి కూడా కల్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. హదియా వాంగ్మూలం సేకరించ వద్దంటూ ఎన్‌ఐఏ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చింది. హదియను హిప్నటైజ్‌ చేశారని, ఆమె మాటలు నమ్మవద్దని ఎన్‌ఐఏ వాదించగా, ఆ వాదనలను హదియ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఖండించారు. హదియ గతేడాది డిసెంబర్‌లో మతమార్పిడి చేసుకుని ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం 'లవ్‌ జిహాద్‌ కేసు' గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

No comments:

Post a Comment