Tuesday, 21 November 2017

'పద్మావతి'కి 200 శాతం మద్దతు : రణ్‌వీర్

'పద్మావతి'కి 200 శాతం మద్దతు : రణ్‌వీర్
21-11-2017 19:35:56

ముంబై: సంజయ్ లీలా బన్సాలీ 'పద్మావతి' చిత్రం బాక్సాఫీస్ ఫేట్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం 'పద్మావతి'కి మద్దతు ప్రకటించడంలో వెనుకంజ వేయడం లేదు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో టైటిల్ పాత్రధారిణి దీపిక పదుకొనే విమర్శలు, బెదరింపులు ఎదుర్కొంటోంది. తాజాగా ఈ వివాదంపై సినిమాలో ముఘల్ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోషించిన రణ్‌వీర్ సింగ్ ఆచితూచి స్పందించారు. మంగళవారంనాడు ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రణ్‌వీర్‌పై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. 'సినిమాకు, మా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి నేను 200 శాతం మద్దతు ఇస్తున్నాను. సినిమా గురించి ఏ విషయం మాట్లాడవద్దని నాకు చెప్పారు. అధికారికమైన సమాచారం ఏది ఉన్నా నిర్మాతల నుంచి ఆ సమాచారం తీసుకోవచ్చు' అని రణ్‌వీర్ నవ్వుతూ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ కర్ణిసేన సహా పలు సంస్థలు దేశవ్యాప్త ఆందోళనకు దిగడంతో విడుదల తేదీని చిత్ర నిర్మాతలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇవ్వనందున సినిమాను నిషేధించాలని కోరుతూ వేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

No comments:

Post a Comment