అల్లాదీన్ ఖిల్జీ మంగోల్స్ నుండి భారతీయ నాగరికతను రక్షించాడు
-సల్మాన్ హైదర్
పద్మాతి చిత్రం అనేక వివాదాలకు కారణం అవుతున్నది. దానిలోని ప్రధాన పాత్ర అయిన అల్లాఉద్దిన్ ఖిల్జీ గురించి కొన్ని చారిత్రిక వాస్తవాలు తెలుసు కొందాము.
భారతదేశం యొక్క అత్యుత్తమ రాజులలో ఒకరు మరియు ప్రపంచ గొప్ప సైనిక నిపుణులులో ఒకరుగా అల్లాఉద్దిన్ ఖిల్జీ పేరుగాంచారు. అల్లా ఉద్దిన్ ఖిల్జీ క్రీ.శ 1266 లో ఢిల్లీలో జన్మించాడు (ఒక భారతీయుడు, ఒక విదేశీ ఆక్రమణదారుడు కాదు) మరియు ఢిల్లీ సుల్తాన్ గా 1296 AD నుండి 1316 వరకు పాలించాడు.అల్లాఉద్దిన్ ఖిల్జీ తన మామ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ నుండి పొందిన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతని విజయాల్లో చాలా హిందూ సామ్రాజ్యాలు చిత్తూరు, దేవగిరి, వరంగల్ రాజ్యాలు, గుజరాత్, రణధంబోర్, మరియు హొయసల మరియు పాండ్య రాజ్యాలు కలవు.
అల్లాఉద్దిన్ ఖిల్జీ కి భారతదేశం ఎంతో రుణపడి ఉంది.ఎందుకంటే అతని పాలనలో, చాగటై ఖానేట్ యొక్క మంగోలులు (Mongols of the Chagatai Khanate) భారతదేశo పై దండెత్తారు. అల్లాఉద్దిన్ ఖిల్జీ ఐదు సార్లు మంగోలుల దండయాత్రను నిలువరించారు. 1298 AD లో (అల్లుగ్ ఖాన్ నాయకత్వం లో మంగోలుల దండయాత్ర - 20,000 మంది మంగోలులు మరణించారు), 1299 AD సింధ్ పై దండయాత్ర (జఫర్ ఖాన్ నాయకత్వం వహించాడు), 1299 లొ డిల్లి లో స్వయంగా మంగోలుల పై దండయాత్ర, 1305 AD లో (మాలిక్ నాయక్ నేతృత్వంలో మంగోలుపై దండయాత్ర - 8000 మంది మంగోలుల మరణాలు) మరియు 1306 AD (మాలిక్ కఫూర్ నేతృత్వంలో); మరియు 1303 AD లో స్వయం గా మంగోలుల పై దండయాత్ర (మంగోలులు ఖిల్జీని ఓడించలేక పోయారు)
ఆ రోజుల్లో మంగోలులు సైనిక శక్తీ అసాధారణ స్థాయిలో ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతం మరుభూమి గా మిగిలేది. ప్రపంచంలోని ఏ సామ్రాజ్యం - రష్యా సామ్రాజ్యం లేదా శక్తివంతమైన పెర్షియన్ సామ్రాజ్యం లేదా బాగ్దాద్ ఖలిఫాత్ - భయంకరమైన మంగోలు దండయాత్రలను నిలువరించ లేక పోయినవి. ఖిల్జీ వాటిని 5 సార్లు ఓడించినాడు. ఖిల్జీ ఆధ్వర్యంలో ఢిల్లీ సుల్తానేట్ యొక్క సైన్యాలు ప్రపంచంలోని అత్యంత క్రమశిక్షణా మరియు బాగా శిక్షణ పొందిన సైన్యాలలో ఒకటి. అవి మంగోలులను మళ్లీ మళ్లీ ఓడిపోయేలా చేసినవి.
ఇప్పుడు, మంగోలుల విద్వంసక సైనిక శక్తీ గురించి తెలియని వ్యక్తులు: "అయితే ఏమిటి? విదేశీ ఆక్రమణదారులు అయిన ఒక ముస్లిం పాలకుడు మరొక విదేశీ దండయాత్రను ఓడిoచాడు! ". కానీ అది మంగోలుల విద్వంసక సైనిక శక్తీ పట్ల భారీ అజ్ఞానాన్నితెల్పుతుంది
మంగోలు యుద్ధాన్ని చేయడానికి చాలా విచిత్రమైన మార్గం ఎన్నుకొన్నారు. వారు ఒక దేశం పై జయించినప్పుడు, వారు ఆ రాజ్యం లో విద్వoసకం సృష్టిస్తారు. వారు ఆ రాజ్యం లో ఏదీ విడిచిపెట్టరు - అక్కడ ఉన్న నాగరికతను సర్వ నాశనం చేస్తారు. వారు జయించిన ప్రదేశంలో స్థిరపడరు. సర్వం మంగోలియాకు దోచుకొని తీసుకు వెళ్తారు. వారు స్త్రీలను, పిల్లలను బానిసలుగా తీసుకొని మగవారిని చంపి, ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉన్నవారిని సేవకులుగా తీసుకు వెళ్తారు మరియు ఒక బంజరు భూమిని వెనుక వదిలి వెళ్తారు. మంగోలు కేవలం దాడి చేసి జయించరు; వారు నాగరికతలను నిర్మూలించారు. మంగోలులను "దేవుని శాపము" గా సూచించటానికి అది కారణంగా ఉంది.
మంగోలు భారతదేశం ను జయించినట్లయితే, భారతదేశం దాని అభివృద్ధిలో కనీసం రెండు లేదా మూడు వందల సంవత్సరాలుగా వెనుకకు వెళ్ళేది. భారతదేశం మిల్లినియం సేకరించిన మొత్తం జ్ఞానం మరియు సంస్కృతి నాశనం చేయబడేవి. ప్రతి లైబ్రరీ, ప్రతి పాఠశాల, ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు దహనం చేయబడేవి. మంగోల్ ఇల్ఖానేట్ యొక్క హులాగ్ ఖాన్ 1258 లో బాగ్దాద్ను జయిoచినప్పుడు దాన్ని జనసంచార రహిత నగరం గా చేసి వదిలివేసాడు. అతను అబ్బాసిడ్ సామ్రాజ్యం యొక్క గొప్ప గ్రంథాలయాలను నాశనం చేసాడు (మంగోలులు గ్రంథాలయాలను కొల్లగొట్టి వాటిలోని పుస్తకాలను నదుల పాలు చేసారు ఆ పుస్తకాల ఇంకు కారణంగా నదుల నీరు నల్లగా మారినట్లు చెప్పబడింది) మరియు రక్తం యూఫ్రేట్స్ మరియు టైగ్రిస్ నదుల అందు అతని దాడి తర్వాత వారాల పాటు పారింది. . అతను ఇస్లామిక్ స్వర్ణయుగం ప్రగతిని ముగించాడు. మంగోలు దాడి చేసిన తరువాత ఇదే విధమైన విషయం రష్యాకు జరిగింది. రష్యా మంగోల్ దండయాత్ర తరువాత రష్యా అభివృద్ధిలో 200 ఏళ్ళు వెనుకకు వెళ్లినట్లుగా భావించబడింది. మంగోలు ఏ ఇతర ఆక్రమణదారుని వలె లేరు.
ఖిల్జీ మంగోలులతో ఒడి పోయినట్లయితే, ఖిల్జీకి వ్యతిరేకంగా మంగోల్స్ గెలిచినట్లయితే, వారు ప్రపంచం యొక్క మాప్ నుండి భారత నాగరికతను తుడిచిపెట్టేవారు. కథ చెప్పడానికి ఏమీ ఉండదు.
భారతదేశం హిందూ సంస్కృతిని కలిగి ఉంటే, దాని వెనుక ఒక పెద్ద క్రెడిట్ అల్లాఉద్దిన్ ఖిల్జీకి వెళ్ళవలసి ఉంది. అతను మంగోల్ నుండి ఇండియాను రక్షించాడు. హిందూ మతాన్ని కాపాడాడు.
No comments:
Post a Comment