Tuesday 28 November 2017

హిందూ పేరుతోనే.. ‘హదియా’ చదువు

హిందూ పేరుతోనే.. ‘హదియా’ చదువు

Nov 29, 2017, 08:55 IST
  Hadiya to Continue Her Studies Under Hindu Name - Sakshi
సాక్షి, సేలం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్‌ జీహాద్‌ వ్యవహారంలో యువతి హదియా.. హిందూపేరుతోనే వైద్య విద్యను పూర్తి చేయనున్నట్లు సేలమ్‌ హోమియోపతి మెడికల్‌ కాలేజ్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ జీ. కన్నన్‌ స్పష్టం చేశారు. హదియాగా పేరు, మతం మార్చుకున్నా.. కాలేజ్‌ రికార్డుల్లో మాత్రం అఖిలా అశోకన్‌గానే గుర్తిస్తామని ఆయన తెలిపారు. హదియాను ఆమె తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు అవకాశం ఉందని.. ఇతరులు ఎవరూ ఆమెను కలవకూడదని ఆయన స్పష్టం చేశారు.  హదియా బుధవారం నుంచి తరగతులకు హాజరవుతుందని ప్రిన్సిపాల్‌ కన్నన్‌ తెలిపారు.

సుప్రీంకోర్టు సూచలన మేరకు హదియా.. తన వైద్య విద్యను కొనసాగించేందుకు కేరళ పోలీసు భద్రత మధ్య సేలం చేరుకున్నారు. కాలేజీకి చేరుకున్న హదియా.. ఉన్నతాధికారులను కలిశారు. కాలేజ్‌ పరిసరాల్లో భర్త షఫీన్‌ జహాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ను కోరారు.

అఖిలా అశోకన్‌.. సేలంలోని వైద్య కళాశాలలో వైద్య విద్య చదువుతోంది. నాలుగున్నరేళ్లు చదివిన అనంతరం పరిచయమైన షబ్బీన్‌ జహాన్‌నే అనే ముస్లింను పెళ్లిచేసుకుని పేరును, మతాన్నిమార్చుకుంది. అఖిళా అశోకన్‌.. హదియాగా మతం మార్చుకోవడం వెనకు కుట్ర ఉందని ఆమె తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. ఈ వివాహం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ.. హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆమె విద్యను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని ఎన్‌ఐఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హదియా తండ్రి.. అశోకన్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ కటుంబంలోకి ఒక ఉగ్రవాదిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment