ఇస్లామిక్ స్టేట్‌లో చేరాలనుకున్న హిందూ యువతి.. మనసు మార్చిన ఎన్ఐఏ Updated :21-09-2015 15:53:13 |
న్యూఢిల్లీ, సెప్టంబర్ 21: నరరూప రాక్షసుల ముఠాగా పేరున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసిపోయేందుకు ఢిల్లీకి చెందిన ఓ హిందూ యువతి యత్నించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె తండ్రి, మాజీ సైన్యాధికారి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని సంప్రదించారు. తన కుమార్తె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. ఆస్ట్రేలియాకు వెళ్లి వచ్చినప్పటి నుంచీ ఇస్లామిక్ స్టేట్ రిక్రూటర్లతో కంప్యూటర్ ద్వారా టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించిన ఆయన ఎన్ఐఏ అధికారులను సంప్రదించి సహకరించాలని కోరారు. సిరియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆమె పథకాన్ని పసిగట్టి విఫలం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఈ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. తిరిగి వచ్చాక సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసిపోయేందుకు పథకం వేసుకుంది. ఆస్ట్రేలియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి ప్రభావంతో్ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఎన్ఐఏ అధికారుల కౌన్సిలింగ్‌తో సదరు యువతి తన మనసు మార్చుకుందని తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలతో ఇరాక్, సిరియాలో వేలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వేలాది మంది యాజ్దీ యువతులను, బాలికలను అపహరించుకుని పోయి సెక్స్ బానిసలుగా మార్చారు.
|
No comments:
Post a Comment