మాదే పెద్ద ముస్లిం దేశం: రాజ్‌నాథ్ Updated :12-09-2015 02:02:29 |
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 : ‘పొరుగుదేశాలతో భారత్ స్నేహపూర్వక శాంతియుత వాతావరణాన్ని కాంక్షిస్తుంది. పాకిస్థాన్‌పై భారత్ తొలి బులెట్ పేల్చబోదు’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, పాక్ నడుమ డీజీ స్థాయి చర్చల్లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ రేంజర్ల డీజీ ఉమర్ ఫారూక్ బర్కీతో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ కన్నా భారతదేశమే పెద్ద ముస్లిం దేశమన్నారు. అక్కడ కన్నా ఎక్కువ సంఖ్యలో ముస్లింలు భారత్‌లో నివసిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌పై భారత్ తొలి బులెట్ పేల్చబోదని, అయితే భారత్‌లోకి చొరబాట్లు ఉండబోవన్న హామీ ఇవ్వాలని బర్కీని కోరారు. దీనిపై బర్కీ స్పందిస్తూ.. తాను పాక్ రేంజర్లకు మాత్రమే చీఫ్‌నని పాక్ నాయకత్వానికి కాదన్నారు. రాజ్‌నాథ్ విజ్ఞప్తిపై ఎలాంటి హామీ ఇవ్వలేనన్నారు.
|
No comments:
Post a Comment