వలసదారులకు ఆశ్రయమిచ్చిన శ్మశానం Updated :25-09-2015 16:51:20 |
క్రొయేషియా, సెప్టెంబర్ 25 : వలసదారుల కష్టాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. వారికి ఆశ్రయం ఇవ్వడానికి ఐరోపా దేశాలు నానా అవస్థలు పడుతున్నాయి. 500 మంది వలసదారులు సెర్బియా, క్రొయేషియా సరిహద్దులోని శ్మశానంలో నిలిచిపోవలసి వచ్చింది. మరోవైపు క్రొయేషియా నుంచి వెయ్యి మంది వలసదారులు హంగేరీ చేరుకున్నారు.
వలసదారులకు శ్మశానమే ఆశ్రయంగా మారింది. సెర్బియా, క్రొయేషియా దేశాల మధ్య ఉన్న నో మ్యాన్స్ ల్యాండ్‌లోని శ్మశానంలో 500 మంది వలసదారులు తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం నాడు సెర్బియా నుంచి క్రొయేషియాలోకి ప్రవేశిస్తున్న వలసవాదులకు ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. తోవార్నిక్ నగరం వద్ద సరిహద్దులు దాటి క్రొయేషియాలోకి వెళ్లడానికి వలసదారులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని క్రొయేషియా పోలీసులు నిలువరించారు. తమ గడ్డమీదకు రావద్దంటూ అపేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక వలసదారులు చాలా సేపు అవస్థలు పడ్డారు. చివరికి క్రొయేషియా అధికారులు వారికి బస్సులు ఏర్పాటు చేశారు. తమ దేశంలోని రిజిస్ర్టేషన్ కేంద్రానికి వారిని తరలించారు. వలసవాదులను సెర్బియా కేవలం తమ దేశం మీదకే వదిలివేస్తోందని క్రొయేషియా వాదిస్తోంది. వారిని హంగేరీ మీదుగా ఉత్తర ఐరోపాలోకి పంపించే అవకాశం ఉన్నా అలా చేయడంలేదని మండిపడుతోంది. |
No comments:
Post a Comment