మోదీతో ఒవైసీ రహస్య భేటీపై పుకార్లు ఎవరి పని? Updated :18-09-2015 14:51:57 |
న్యూఢిల్లీ, సెప్టంబర్ 18: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రధాని మోదీతో ఎంఐఎం అధినేత ఒవైసీ రహస్యంగా భేటీ అయ్యారని జెడియూ ఆరోపించింది. మహా కూటమిని ఓడించేందుకు ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఈ రహస్య భేటీ జరిగిందని ఆరోపించింది. కొన్ని మీడియా సంస్థలు కూడా మోదీతో ఒవైసీ రహస్య భేటీ అయ్యారంటూ వార్తలిచ్చాయి. దీనిపై బిజెపి మండిపడింది. పుకార్లు పుట్టించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు ఎంఐఎం పార్టీ కూడా ఈ పుకార్లను ఖండించింది. కోర్టుకు ఈడుస్తామని వార్నింగ్ ఇచ్చింది. మోదీ ఒవైసీ రహస్య భేటీ జరిగిందనే వార్తలను ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు ఖండించడం లేదని జెడియూ వాదిస్తోంది. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్‌లో సీమాంచల్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఎంఐఎం ప్రకటించినప్పటి నుంచీ మహాకూటమి నేతలకు నిద్ర కరువైంది. ఒవైసీ నిర్ణయం తమ ఓటమికి కారణమయ్యే అవకాశముందని జెడియూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ వణికిపోతున్నాయి.
|
No comments:
Post a Comment