వలసదారులు, శరణార్థులను ఆదరించి అక్కున చేర్చుకోండి : పోప్ Updated :25-09-2015 16:26:59 |
వాషింగ్టన్, సెప్టెంబర్ 25 : అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచ ప్రజల కష్టనష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపు ఇచ్చారు. వలసదారులను ఆత్మీయంగా అక్కున చేర్చుకోవాలని అమెరికన్లకు సూచించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో పోప్ ప్రసంగించారు. దాంతో ఆయన వాషింగ్టన్ పర్యటన పూర్తి అయింది. అక్కడి నుంచి ఆయన న్యూయార్క్ వెళ్లారు.
వలసదారులు, శరణార్థులను ఆదరించాలని పోప్ ఫ్రాన్సిస్ అమెరికాకు పిలుపు ఇచ్చారు. వలసదారుల గతతాన్ని తవ్వితీసి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నవారిని నిరాధరించవద్దని సూచించారు. తాను స్వయంగా ఒక శరణార్ధి కొడుకునని... అలాంటి వారి కష్టాలు ఎలా ఉంటాయో తనకు అనుభవ పూర్వకంగా తెలుసునని పోప్ చెప్పారు. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా మిగిలిన అమెరికా తన శక్తి సామర్ధ్యాలను ప్రజల గాయాలు మాన్పడానికే ఉపయోగించాలని ఆయన అన్నారు. ద్వేషం, నిరాస, పేదరికం, కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రపంచాన్ని బాగుచేయాల్సిన బాధ్యత అగ్రరాజ్యంపై ఉందని పోప్ ఫ్రాన్సిస్ గుర్తు చేశారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆ ఘనత సాధించిన మొదటి పోప్ ఆయనే. శనివారం వరకు ఆయన న్యూయార్క్‌లో ఉంటారు. అక్కడ ఆయన ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్నారు. |
No comments:
Post a Comment