Friday 20 April 2018

మాజీ చీఫ్ జస్టిస్ సచార్ కన్నుమూత

మాజీ చీఫ్ జస్టిస్ సచార్ కన్నుమూత
20-04-2018 15:02:43

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, ప్రముఖ హక్కుల కార్యకర్త రాజిందర్ సచార్ శుక్రవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. వయోభారం కారణంగా తలెత్తిన సమస్యలతో ఈ వారం ప్రారంభంలో ఆయనను ఇక్కడి ఫోర్టిస్ హాస్పిటల్‌లో చేర్చారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన కన్నుశారు. సాయంత్రం 5.30 అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1985 ఆగస్టు 6 నుంచి, 1985 డిసెంబర్ 22 వరకూ సచార్ పనిచేశారు. పదవీవిరమణ తర్వాత కూడా హక్కుల సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్‌తో అనుబంధం కొనసాగించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై యూపీఏ ఏర్పాటు చేసిన కమిటీకి సచార్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. సచార్ కమిటీ పేరుతో ఏర్పాటైన ఆ కమిటీ 2006 నవంబర్‌లో పార్లమెంటుకు 403 పేజీల నివేదికను సమర్పించింది.

No comments:

Post a Comment