Saturday 14 April 2018

ముస్లింలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Apr 10, 2018, 09:57 IST
  Rajasthan BJP MLA Sensational Coments On Muslim Community - Sakshi
బీజేపీ ఎమ్మెల్యే బీఎల్‌ సింఘాల్‌ (ఫైల్‌పోటో)

జైపూర్‌ : ముస్లిం సోదరులపై బీజేపీ ఎమ్మెల్యే బీఎల్‌ సింఘాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్లు వద్దనుకోవడం అంటే వారు చేసే నేరాలను ఉపేక్షించడం కాదని వ్యాఖ్యానించారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు ఇదే తొలిసారి కాదు. ముస్లింల జనాభా ఎక్కడైనా 30 శాతానికి మించి ఉంటే వాళ్లు ఆ దేశంపై ప్రాబల్యం చెలాయిస్తారని ఈ ఏడాది జనవరిలో సింఘాల్‌ అన్నారు. బారత్‌లో హిందువులు ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకుని, వారిని ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా మలిచేందుకు కష్టపడుతుంటారని.. అయితే ముస్లింలు మాత్రం వారి జనాభాను పెంచుకుని దేశంపై పట్టు కోసం పాకులాడుతున్నారని సింఘాల్‌ గతంలో వ్యాఖ్యానించారు.

ముస్లింలు తమ పిల్లల విద్య, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వరని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. హిందువులు తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేందుకు డబ్బులు వెచ్చిస్తే ముస్లింలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఇంట్లో నిల్వ చేసుకుంటారని ఆయన తన నియోజకవర్గం ఆల్వార్‌లోని ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. ముస్లింలు దేశంలో మెజారిటీ వర్గంగా అవతరిస్తే వారు హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తారని సింఘాల్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ వారే ఉండేలా ముస్లింలు వ్యవహరిస్తారని అన్నారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికి మించి సంతానం ఉండరాదనే చట్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment