Wednesday 18 April 2018

కఠువా రేప్ కేసులో మీడియాకు షాక్...

కఠువా రేప్ కేసులో మీడియాకు షాక్...
18-04-2018 15:33:07

న్యూఢిల్లీ: కఠువా అత్యాచారం కేసులో బాధితురాలి పేరును బహిరంగపర్చిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు కొరడా రుళిపించింది. ఆమె పేరును వెల్లడించిన మీడియా సంస్థలన్నీ రూ.10 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి కుటుంబానికి అందేలా పరిహారం నిధిలో జమచేయాలని ధర్మాసనం నిర్ణయించింది. ఇకపై అత్యాచారం కేసులో బాధితుల పేర్లు వెల్లడిస్తే ఆరునెలల పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

జమ్మూ కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఎనిమిదేళ్ల ఓ బాలికపై కొందరు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆపై దారుణంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటనపై బాధితురాలి పేరును కూడా కొన్ని మీడియా సంస్థలు వెల్లడించడంతో హైకోర్టు ఈ నెల 13న ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇకపై బాధితురాలికి చెందిన ఎలాంటి గుర్తింపు బయటికి పొక్కకుండా చూడాలని ఆదేశించింది.


No comments:

Post a Comment