చివరికి పాకిస్థాన్‌లో కూడా ఈ విధానం ఉంది:షా
ఉగ్రవాద వ్యతిరేక సవరణ బిల్లుపై హోంమంత్రి వ్యాఖ్య
దిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక బిల్లు సవరణలపై ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. ‘ఏ పార్టీ అధికారంలో ఉందనే
విషయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉగ్రవాదం మీద పోరాడుతుంది’ అని బుధవారం పార్లమెంటులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పార్లమెంటులో
ప్రవేశ పెట్టిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక(సవరణ)బిల్లు కింద ఉగ్రవాద సంబంధాలున్నాయని అనుమానం ఉన్న వ్యక్తిని ‘ఉగ్రవాది’గా గుర్తిస్తుంది.
అయితే దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని నిలదీసే వారిని జాతివ్యతిరేకి అంటూ ముద్రవేసే అవకాశం ఉందన్న విపక్షాల ఆరోపణలపై షా స్పందిస్తూ..నిజమైన సామాజిక కార్యకర్తలను
వేధించే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. ‘దేశంలో మంచి పనులు చేస్తోన్న సామాజిక కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మేం పట్టణ మావోయిస్టుల
మీద చర్యలు తీసుకోనున్నాం’ అని వెల్లడించారు. ‘ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా గుర్తించడానికి నిబంధన ఉండాల్సిన అవసరం ఉంది. యూఎన్ వద్ద కూడా
దీనికి ఒక విధానం ఉంది. చివరికి పాకిస్థాన్‌కు కూడా ఉంది. చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్..ఇలా ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి ఒక
విధానం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని, దీనికి సవరణలు తీసుకువచ్చి కఠినతరం చేశారు. అప్పుడు మీరు చేసింది సరైందే అయితే
ఇప్పుడు మేం చేసేది కూడా సరైందే’ అని షా పార్లమెంటులో విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సవరణ బిల్లును ప్రభుత్వం హడావుడిగా
తీసుకువచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విమర్శించారు. బిల్లులోని నిబంధనను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయూ కూడా
వ్యతిరేకించారని థరూర్ గుర్తుచేశారు.

No comments:
Post a Comment