తక్షణ తలాక్‌కు చెల్లుచీటీ
31-07-2019 01:29:14
రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం
బీజేపీ పాచిక... రాజ్యసభలో చీలిక
15 ఓట్ల ఆధిక్యంతో అధికారపక్షం పైచేయి
99-84 ఓట్ల తేడాతో బిల్లు పాస్
పరోక్షంగా సహకరించిన 57 మంది ఎంపీలు
వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన జేడీయూ, అన్నాడీఎంకే
సభకు హాజరుకాని ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు
గైర్హాజరై ఆశ్చర్యపరిచిన పీడీపీ ఎంపీలు
టీడీపీ ఎంపీల్లో ఒకరు డుమ్మా.. మరొకరు వాకౌట్
వైసీపీలో ఒకరు వ్యతిరేకం.. మరొకరు గైర్హాజరు
లోనికే వెళ్లని టీఆర్‌ఎస్.. సెంట్రల్ హాల్లో పిచ్చాపాటీ
ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన బీజేడీ
విపక్షంలో చీలిక, గైర్హాజరుతో లాభపడ్డ బీజేపీ
హిందువుల్లోనూ బహు భార్యాత్వం నిషేధమే
వారికీ జైలుశిక్ష ఉందని సమర్థించుకున్న ప్రభుత్వం
ముస్లిం కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యం: విపక్షం
‘‘తలాక్.. తలాక్... తలాక్...’’ మూడుసార్లు దీన్ని ఉచ్చరించి.. తక్షణం విడాకులిచ్చే సంప్రదాయానికి ఇక స్వస్తి! నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభలో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 19 నెలలుగా పెద్దల సభలో ఇరుక్కుపోయి, రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన తక్షణ తలాక్ బిల్లుకు 15 ఓట్ల తేడాతో ఎట్టకేలకు ఆమోదముద్ర పడింది. బిల్లుపై విపక్ష, అధికార పక్షాలు రెండింటిలోనూ చీలికలు రావడం విశేషం. 57 మంది విపక్ష, తటస్థ ఎంపీలు వాకౌట్, గైర్హాజర్.. తదితర మార్గాల్లో బిల్లు ఆమోదానికి సహకరించారు. ఆ రకంగా చీలిక తేవడంలో బీజేపీ పూర్తిగా సఫలమైంది. ‘‘మధ్యయుగాల నాటి దురాచారాన్ని చరిత్ర చెత్తబుట్టలో పడేశాం.. ఓ కొత్త చరిత్రను సృష్టించాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూలై 30: ముస్లిం వివాహ హక్కుల పరిరక్షణ చట్ట సవరణ (తక్షణ తలాక్ నిషేధ) బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. బిల్లుపై సభలో పదునైన చర్చ జరిగింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షం పట్టుబట్టింది. ప్రభుత్వ అందుకు ఒప్పుకోలేదు. అంతిమంగా బిల్లును ఓటింగ్‌కు పెట్టినపుడు అనుకూలంగా 99 ఓట్లు పడగా.. వ్యతిరేకిస్తూ 84 మంది ఓటేశారు. రెండు ఎన్‌డీయే భాగస్వామ్య పక్షాలు- జేడీయూ, అన్నాడీఎంకే బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి. ఓటింగ్‌కు ముందురోజు రాత్రి.. అంటే సోమవారం రాత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్‌కు వ్యూహాత్మకంగా ఫోన్ చేశారు. అయితే ఈ బిల్లుకు ఆమోదాన్ని కోరలేదు. బిహార్‌లో వరదల పరిస్థితి, తీసుకుంటున్న చర్యలపై మాత్రమే మాట్లాడి ఊరుకున్నారు.
విపక్షం కకావికలు
బిల్లును ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అడ్డుకుంటున్న కాంగ్రెస్ కూడా తగిన సన్నద్ధత లేక చతికిలపడింది. కాంగ్రెస్ ఎంపీలు ఆస్కార్ ఫెర్నాండెజ్, వివేక్ తన్‌ఖా, ముకుత్ మిథి, రంజీబ్ బిస్వాల్, ప్రతా్‌పసింగ్ బజ్వా, కేటీఎస్ తులసి సభకు హాజరుకాలేదు. కాంగ్రె్‌సకు రాజీనామా చేసి గురువారం బీజేపీలో చేరనున్న సంజయ్ సింగ్ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. బిల్లుపై నిరసన వ్యక్తం చేసిన వైసీపీలో ఒకరు గైర్హాజరయ్యారు. విజయసాయి రెడ్డి మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. టీఆర్‌ఎ్‌సకు చెందిన ఎంపీలు సభకు వెళ్లకుండా సెంట్రల్ హాలుకే పరిమితమయ్యారు. గతంలో బిల్లును ప్రవేశపెట్టినపుడు వ్యతిరేకించిన రీత్యా.. సభకు వెళ్లవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు చెప్పినట్లు ఎంపీలు వెల్లడించారు. ‘‘మన వైఖరి ఇప్పటికే చెప్పాం కదా.. ఇపుడు వెళ్లకుండా ఉంటేనే మంచిది’’ అని ఆయన సూచించినట్లు కే కేశవరావు చెప్పారు. ఎస్పీ సభ్యుల్లో ఇద్దరు సభకు రాలేదు. మిగిలినవారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయి.. పరోక్షంగా ప్రభుత్వానికి సహకరించారు. బీఎస్పీ సభ్యుల్లో కొందరు వాకౌట్ చేశారు. కొందరు సభలోనే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
బిల్లుకు బీజేడీ మద్దతిచ్చి బీజేపీకి పూర్తి బాసట ప్రకటించింది. టీడీపీకి చెందిన ఇద్దరిలో సీతామాలక్ష్మి సభకు రాలేదు. కనకమేడల రవీంద్రకుమార్ సభలో బిల్లును వ్యతిరేకించారు తప్ప ఓటింగ్‌లో పాల్గొనలేదు. తాను వాకౌట్ చేశానని ఆ తరువాత ఆయన చెప్పుకొచ్చారు.. ఆయనను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసేందుకు ఇటీవల బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ తీవ్రయత్నాలు చేశారు. తృణమూల్ ఎంపీలిద్దరు, ఆర్జేడీ ఎంపీ రాం జెఠ్మలానీ కూడా హాజరుకాకపోవడం విపక్ష శిబిరంలో అనైక్యతను ప్రస్ఫుటం చేసింది. ఆఖరికి ఎన్సీపీ నేతలు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ కూడా సభకు రాలేదు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కశ్మీరీ పార్టీ పీడీపీ ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయి పరోక్షంగా ప్రభుత్వానికి సాయపడడం ఓ విశేషాంశం. బిల్లును చర్చకు చేపట్టడమే అసందర్భమని, సుప్రీంకోర్టు నిషేధంతో ఏనాడో ఇది అమల్లోకొచ్చిందని మెహబూబా ముఫ్తీ ఆ తరువాత ట్వీట్ చేశారు.
సూత్రప్రాయంగా మేం సమర్థించాం.. కానీ.. : కాంగ్రెస్
మొత్తం మీద చూస్తే.. విపక్ష, తటస్థ పార్టీల్లో వచ్చిన ఈ చీలికలు, గైర్హాజర్లతో బీజేపీ లాభపడింది. రాజకీయంగా తగిన బలం లేకపోయినా రాజ్యసభలో పైచేయి సాధించింది. 242 మంది సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీ మార్కు 121. అన్నాడీఎంకే, జేడీయూల వాకౌట్ వల్ల మేజిక్ మార్కు మరింత తగ్గిపోయింది. అయితే ఈ చీలికలు, మద్దతుల వల్ల చివరకు ఎన్‌డీఏకు 107 మంది సభ్యుల బలం మిగిలింది. విపక్షాలకు ఆ మాత్రం కూడా లేకపోయింది. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 10 మంది, బీఎస్పీకి చెందిన నలుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోవడం విపక్షాలకు పెద్దదెబ్బ. పట్టుదలతో బిల్లును సభామోదం పొందేలా చూడడం కోసం బీజేపీ మేనేజర్లు నిర్విరామ కృషి చేశారు. బిల్లును ఎలాగైనా ఓడగొట్టాలన్న తపన విపక్షంలో కరువయ్యింది. ‘‘బిల్లును మేం సూత్రప్రాయంగా ఆమోదించాం. కానీ తక్షణ తలాక్ ఇచ్చిన భర్తలకు మూడేళ్ల జైలుశిక్ష విధింపును మాత్రం వ్యతిరేకించాం. కారణం.. ఇది కుటుంబ క్షేమానికి మంచిది కాదు. దీని వల్ల అంతరాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. మరో రెండు క్లాజులను కూడా మేం వ్యతిరేకించాం. ప్రభుత్వం విపక్షాల మాటకు విలువ ఇవ్వలేదు. రాజకీయ ప్రయోజనాలే చూసుకుంది’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.
మత పరమైన సంప్రదాయాల చుట్టూనే చర్చ!
బిల్లుపై నాలుగున్నర గంటలపాటు జరిగిన చర్చ.. ఎక్కువ భాగం మతపరమైన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల చుట్టూనే సాగింది. ‘‘బిల్లును ఓటుబ్యాంకు రాజకీయాల కోణం నుంచి చూడకండి. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. లైంగిక సమానత్వం, సమన్యాయం, మహిళల ఔన్నత్యం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీనిని తీసుకువచ్చాం. 2017లో తక్షణ తలాక్‌ను సుప్రీంకోర్టు నిషేధించాక కూడా 574 కేసులు నమోదయ్యాయి. ఇందులో 121 కేసులు మేం చివరిసారి ఆర్డినెన్స్ తెచ్చినపుడు.. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నమోదయ్యాయి. 20 ఇస్లామిక్ దేశాలు దీన్ని నిషేధించాయి. మహిళా సాధికారికతకు ఇది అవసరం’’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు విపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. ‘‘బిల్లు మౌలికంగా రాజ్యాంగవిరుద్ధం. స్వాభావికంగా నిరంకుశమైనది. తక్షణ తలాక్ చెప్పిన భర్తను జైలుకు పంపితే.. విడుదలయ్యాక నేరగాడిగా మారతాడు’’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ హెచ్చరించారు.
ఇది కేవలం ముస్లిం మహిళలకే వర్తింపజేస్తున్నారని, 498-ఏ లాంటి చట్టాలు అన్ని మతాల వారికీ వర్తింపజేసినపుడు దీని విషయంలో వివక్ష కేవలం ఓటుబ్యాంకు రాజకీయమేనని కాంగ్రెస్, తృణమూల్ సహా అనేక మంది సభ్యులు నిలదీశారు. దీనికి బదులిచ్చిన రవిశంకర్ ప్రసాద్ హిందువుల్లో కూడా వరకట్నంపై నిషేధం ఉందని, ఒకరి కంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడమూ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల మూకుమ్మడి డిమాండ్‌ను ఓటింగ్‌కు పెట్టినపుడు 100-84 ఓట్ల తేడాతో అది వీగిపోయుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా బీజేపీకి చెందిన వివిధ వ్యూహకర్తలతో కలిసి పలువురు పార్టీల నేతలతో మాట్లాడడం, ఎప్పటికపుడు తమ వ్యూహాన్ని సమీక్షించడం వల్ల బిల్లు ఆమోదానికి ఢోకా లేకుండా పోయింది. రాజ్యసభ ఆమోదం కూడా లభించడంతో పార్లమెంట్ ఆమోదం మొత్తం సాధించినట్లయింది. ఇక రాష్ట్రపతి సంతకమే తరువాయు. ఇది జరిగిన మరుక్షణం నుంచీ తక్షణ తలాక్ క్రిమినల్ నేరంగా అమలవుతుంది.
ప్రధాని హర్షం
తక్షణ తలాక్ బిల్లును పార్లమెంటు ఆమోదించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘తలాక్ అనేది కాలదోషం పట్టిన మధ్యయుగం నాటి సంప్రదాయం. ముస్లిం మహిళల గౌరవాన్ని ఇది హరిస్తోంది. దీన్ని చరిత్ర చెత్తబుట్టలో పడేశాం. ముస్లిం మహిళలకు చారిత్రకంగా జరిగిన ఓ తప్పిదాన్ని సవరించాం. సమాజంలో సమానత్వ సాధనకు ఇది దోహదపడుతుంది. ఈ విజయం పట్ల భారతావని పులకితమవుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టానికి తెచ్చిన సవరణను ఆమోదించిన అన్ని పార్టీల వారికీ ధన్యవాదాలు. ఈ క్షణం, ఈ సందర్భం చరిత్రలో మిగిలిపోతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘‘తక్షణ తలాక్ నిషేఽధానికి మోదీ మొదట్నుంచీ కట్టుబడ్డారు. ఆయనను అభినందిస్తున్నా.. దేశ చరిత్రలో ఇదో మైలురాయి’’ అని షా రాశారు. ‘‘తలాక్.. తలాక్.. తలాక్.. ఇక ఇది వినబడదు’’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
‘‘ముస్లింలపై 2014 నుంచి జరుగుతున్న అనేక దాడుల్లో తక్షణ తలాక్ కూడా ఒకటి. ముస్లిం మహిళలను మరింత పేదరికంలోకి ఈ బిల్లు తోస్తుంది. తనను మానసికంగా, శారీరకంగా హింసించి జైలు పాలైన భర్తతో కాపురం కొనసాగించాల్సిన దుస్థితిలోకి నెడుతుంది’’
మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ట్రిపుల్ తలాక్ ఇక రద్దు
ట్రిపుల్ తలాక్ ఇక రద్దు
Jul 31, 2019, 04:11 IST
Triple Talaq Bill Passed In Parliament - Sakshi
రాజ్యసభలోనూ గట్టెక్కిన బిల్లు
సభ నుంచి వాకౌట్ చేసిన జేడీయూ, అన్నా డీఎంకే
బిల్లుకు బీజేడీ మద్దతు
వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ
ముస్లిం దేశాలే మారాయి, మనం మార్చకూడదా?: రవిశంకర్ ప్రసాద్
ఇండియా సంతోషిస్తోంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని (ట్రిపుల్ తలాక్ లేదా తలాక్–ఏ–బిద్దత్‌ను) నేరంగా పరిగణించేలా కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభ గతవారమే ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యింది. తలాక్–ఏ–బిద్దత్‌ను ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలోనైనా.. ఎలా చెప్పినా ఆ చర్యను ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది. ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ)’ పేరిట తెచ్చిన ఈ బిల్లును ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నా డీఎంకే పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ, తటస్థ పార్టీ అయిన బీజేడీ బిల్లుకు మద్దతు తెలిపింది.
బిల్లును ఆమోదించడంపై ఓటింగ్ నిర్వహించగా 99 ఓట్లు అనుకూలంగా, 84 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో రాజ్యసభలోనూ ట్రిపుల్ తలాక్ బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చి, కేంద్రం గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ రద్దవుతుంది. బిల్లును ఆమోదించడంపై ఓటింగ్‌కు ముందు.. అసలు ఈ బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అన్న దానిపైనా ప్రతిపక్షాల బలవంతంతో ఓటింగ్ నిర్వహించారు. ఎంపిక కమిటీకి పంపవద్దని 100 ఓట్లు, పంపాలని 84 ఓట్లు పడ్డాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వమే తీసుకొచ్చి, లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నప్పటికీ, రాజ్యసభలో అది తిరస్కరణకు గురైంది. దీంతో రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఈ బిల్లును మరోసారి తీసుకురాగా, పార్లమెంటు ఆమోదం లభించింది.
20 ఇస్లాం దేశాలు కూడా నియంత్రించాయి
బిల్లుపై నాలుగున్నర గంటలు సాగిన చర్చలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ తక్షణ ముమ్మారు తలాక్‌ను 20 ఇస్లాం దేశాలే నియంత్రించాయనీ, ముస్లిం మహిళల మంచి కోసం ప్రజాస్వామ్య దేశమైన మనం ఎందుకు ఆ పని చేయకూడదని ప్రశ్నించారు. హిందువుల్లోనూ బహుభార్యత్వం, వరకట్నం తదితర నేరాలకు జైలుశిక్ష ఉందని గుర్తుచేసిన రవిశంకర్.. ట్రిపుల్ తలాక్ చెప్పే వారికి జైలు శిక్ష విధించడాన్ని సమర్థించారు. ముస్లిం ఇళ్లలో గొడవలు పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఈ బిల్లును తెచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించడంపై రవిశంకర్ సమాధానమిస్తూ, ముస్లిం మహిళల హక్కులను పట్టించుకోనందునే ఆ పార్టీకి 1984 తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ కూడా రాలేదని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధం కాదని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందునే తాము ఇప్పుడు ఈ బిల్లు తీసుకురాలేదనీ, వాట్సాప్‌లో కూడా విడాకులిచ్చే భర్తల నుంచి ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఈ బిల్లును తెచ్చిందని రవిశంకర్ చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వం, లింగ సమానత్వం, మహిళా సాధికారత కోణంలో చూడాలని కోరారు.
టీడీపీ, టీఆర్‌ఎస్ ఓటింగ్‌కు గైర్హాజరు
బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. బీజేపీ నేత అరుణ్ జైట్లీ సైతం ఓటింగ్‌కు రాలేకపోయారు. ఇక ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో సహా కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, ఎన్‌సీపీ ఎంపీలు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్, ఐదుగురు ఎస్పీ నేతలతో సహా మొత్తం 20 మంది ప్రతిపక్ష ఎంపీలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు చెందిన 11 మంది సభ్యుల అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్, ఆర్జేడీకి చెందిన జెఠ్మలానీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో మొత్తం 57 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరమైనట్లయింది. ఫలితంగా సభ్యుల సంఖ్య 183కు చేరి బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 92కు పరిమితమయింది.
బిల్లులో ఏముంది?
తలాక్–ఏ–బిద్దత్(తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పడం)ను ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలో చెప్పినా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్–ఏ–బిద్దత్ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే, వారంట్ లేకుండానే అతణ్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు కల్పిస్తోంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను, తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది.
చారిత్రక తప్పిదాన్ని సరిచేశాం: మోదీ
ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా పురాతన, మధ్యయుగ కాలం నాటి నుంచి ముస్లిం మహిళలకు జరుగుతున్న చారిత్రక తప్పిదాన్ని తాము సరిచేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇకపై ట్రిపుల్ తలాక్ చెత్తబుట్టకు పరిమితమవుతుందన్నారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు ఇండియా సంతోషిస్తోంది. సమాజంలో లింగ సమానత్వం సాధనలో ఇదో విజయం. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ధన్యవాదాలు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన పార్టీల చర్య భారత చరిత్రలో నిలిచిపోతుంది. పురాతన, మధ్యయుగం నాటి విధానమొకటి ఎట్టకేలకు చెత్తబుట్టలోకి చేరింది. ముస్లిం మహిళలు సాధికారత సాధించడంలో, సమాజంలో వారికి సముచిత గౌరవాన్ని సంపాదించుకోవడంలో ఈ చట్టం సహాయపడుతుంది’ అని వివరించారు.
ముస్లింలపై దాడుల్లో ఓ భాగం: ఒవైసీ
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలపడంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 2014 నుంచి దేశంలో ముస్లింల పౌరసత్వం, గుర్తింపుపై జరుగుతున్న దాడుల్లో ఈ బిల్లు ఆమోదం ఒక భాగం మాత్రమేనని ఆయన విమర్శించారు. మూకదాడులు, పోలీసుల దురాగతాలు, సామూహిక ఖైదు తమను నిస్సహాయులను చేయలేవని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ఉన్న బలమైన నమ్మకంతో అణచివేతకు, అన్యాయానికి, హక్కుల తిరస్కరణకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. భారత రాజ్యాంగ బహుళత్వం, వైవిధ్యతను కాపాడేందుకు ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ చట్టం ముస్లిం మహిళలకు వ్యతిరేకమనీ, వారిని మరింత దీనావస్థలోకి నెడుతుందని ఒవైసీ అన్నారు.
వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ
బీజేపీకి 114 మంది సభ్యుల బలం ఉన్నా 11 మంది సభ్యులున్న అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్ వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లిపోవటం, మరికొందరు హాజరుకాకపోవటంతో సభ్యుల సంఖ్య 92కు తగ్గింది. ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్‌సీపీ తొలి నుంచీ కనబరుస్తున్న వైఖరికి తగ్గట్టుగానే ఈ బిల్లును వ్యతిరేకించింది. సభలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. తటస్థ వైఖరితో ఉన్న ఏడుగురు సభ్యుల బిజూ జనతాదళ్ ఆఖరి క్షణంలో ఈ బిల్లుకు మద్దతిచ్చింది. దీంతో మద్దతిచ్చిన సభ్యుల సంఖ్య 99కి చేరింది. దీంతో బిల్లుకు అనుకూలంగా 99 – వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. బిల్లు గట్టెక్కింది.

No comments:
Post a Comment