Thursday, 4 July 2019

వక్ఫ్‌బోర్డు సభ్యులకు షోకాజ్‌ నోటీసులు

వక్ఫ్‌బోర్డు సభ్యులకు షోకాజ్‌ నోటీసులు
05-07-2019 02:58:47
https://www.andhrajyothy.com/artical?SID=837113
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌బోర్డు నిర్వహణలో అవకతవకలు జరిగినందున వక్ఫ్‌ చట్టం 1995 ప్రకారం బోర్డును ఎందుకు రద్దు చేయరాదో తెలియజేయాలంటూ మైనారిటీ సంక్షేమశాఖ ఐదుగురు బోర్డు సభ్యులకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. కాళేశ్వర మార్కెట్‌ వద్ద నిర్మించిన జామి యా మసీదు వాణిజ్య భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థల లీజు విషయంలో జరిగిన అవకతవకలతో పాటు పలు అవినీతి అంశాలను ప్రస్తావించింది. వక్ఫ్‌ సంక్షేమానికి సంబంధించి విధులను సక్రమంగా నిర్వర్తించని సభ్యులు బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించింది. షోకాజ్‌ నోటీసులకు వారంలోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే కొత్తబోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమశాఖ హెచ్చరించింది.
 
ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ రాజీనామా ఆమోదం
రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పెమ్మసాని నరసింహారావు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటి ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వి.దుర్గా భవాని రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది.




No comments:

Post a Comment