రూ.2.36 కోట్లు పలికిన జేపీ దర్గా టెండర్
7/6/2019 11:57:43 PM
https://www.andhrajyothy.com/elections/article?SID=838499
కొత్తూర్: మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా టెండర్ రూ.2 కోట్ల 36లక్షలకు పలికింది. హైదారాబాద్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో అధికారులు శనివారం సీల్డ్ టెండర్ పద్దతి నిర్వహించారు. టెండర్ దక్కించుకునేందుకు పలువురు కాంట్రాక్టర్లు సీల్డ్ టెండర్లు వేశారు. అత్యధికంగా కోడ్ చేసిన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఫసియోద్దిన్‌కు టెండర్ దక్కినట్టు అధికారులు ప్రకటించారు. గత ఏడాది రూ.కోటి 35 లక్షలు పలుకగా, ఈ ఏడాది దాదాపు కోటి రుపాయలు అధికంగా పలికింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు దర్గా హుండీ, నియాజ్‌లతో పాటు 17 ఐటమ్‌లకు చెందిన అదాయాన్ని పొందనున్నట్టు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment