ట్రిపుల్ తలాక్ బిల్లు మతపరమైంది కాదు : రవిశంకర్‌ప్రసాద్
దిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు మతపరమైంది కాదని, మహిళా సమానత్వానికి సంబంధించిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం
లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను ఎన్డీఏ మిత్ర పక్షం జేడీయూ సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే మూడుసార్లు
తలాక్ చెప్పి, భార్యకు విడాకులు ఇచ్చే భర్తకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. ఆ నిబంధనను
దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వాదిస్తున్నాయి.
‘జనవరి 2017 నుంచి ఇప్పటి వరకు ట్రిపుల్ తలాక్ సంబంధించి 574 కేసులు నమోదయ్యాయి. సుప్రీం ఇచ్చిన తీర్పు తరవాతే 345 కేసులు
నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 21 ముస్లిం దేశాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. భారత్‌లో
మాత్రం ఎందుకు వద్దు. బాధితులు సుప్రీంను ఆశ్రయించగా, దానిపై చట్టం తీసుకురావాలని ఆదేశించింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఈ బిల్లు
లింగ న్యాయానికి సంబంధించింది. దీనికి మతం, కులంతో సంబంధం లేదు. ఈ దేశ ఆడబిడ్డల న్యాయం, గౌరవానికి సంబంధించింది. మహిళల
హక్కులు, సాధికారత కోసం దీన్ని తీసుకువస్తున్నాం. దీన్ని రాజకీయ కోణంలో చూడకండి’ అని రవి శంకర్ ప్రసాద్ విపక్షాలను ఉద్దేశించి
వ్యాఖ్యానించారు.
ఈ బిల్లుపై కేంద్రం వాదనలతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. ‘బిల్లులోని నిబంధనను పోలీసులు, ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. వాటిని
మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్ మీడియాకు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
లభించినప్పటికీ, రాజ్యసభలో మాత్రం వ్యతిరేకత ఎదురుకానుంది.
ఈ బిల్లుతో ముస్లిం మహిళలు మరింత దుస్థితి ఎదుర్కొంటారు : కాంగ్రెస్
25-07-2019 14:35:34
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2019ను కాంగ్రెస్ తీవ్రంగా
వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీ జావేద్ మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల భారతీయ ముస్లిం మహిళలు మరింత దయనీయ పరిస్థితులను ఎదుర్కొనవలసి
వస్తుందన్నారు. విడాకులు పొందిన హిందూ మహిళల హక్కుల పరిరక్షణకు కూడా ఓ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటాన్ని తప్పుబట్టారు. తక్షణ ట్రిపుల్ తలాక్
వల్ల చాలా మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనమయ్యాయన్నారు.
ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 20 దేశాలు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను రద్దు
చేశాయని, లౌకికవాదాన్ని అనుసరిస్తున్న భారత దేశం ఆ పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడరాదన్నారు.
ఇది మతపరమైన సమస్య కాదని, భారతీయ ముస్లిం మహిళల గౌరవ, మర్యాదలకు సంబంధించిన విషయమని తెలిపారు.
ముస్లిం పురుషులను దండించేందుకే ఈ బిల్లు : ప్రేమ చంద్రన్
25-07-2019 14:21:20
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2019ను రివల్యూషనరీ సోషలిస్ట్
పార్టీ (ఆర్ఎస్పీ) వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీ ఎన్ కే ప్రేమచంద్రన్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ విడాకులు ఇచ్చిన హిందువులు,
క్రైస్తవులకు జైలు శిక్షను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముస్లింలకే దీనిని వర్తింపజేయడమెందుకని అడిగారు. ఇది ముస్లింలపై వివక్ష
ప్రదర్శించడమేనన్నారు. ముస్లిం పురుషులను శిక్షించడానికే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు.
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చట్టం చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించలేదన్నారు. కేవలం అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు
మాత్రమే చట్టం చేయాలని కోరిందన్నారు. మూక దాడులపై చట్టం చేయడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. ఈ చట్టం చేయాలని
సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతోనే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు.
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లుపై రాజకీయాలు
చేయరాదని తెలిపారు. భర్త తన భార్యకు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి, ఆమెకు విడాకులు ఇవ్వడం మతపరమైన అంశం కాదన్నారు. ఇది
భారతీయ ముస్లిం మహిళల గౌరవ, మర్యాదలకు సంబంధించిన విషయమని వివరించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు వద్దు : రవిశంకర్ ప్రసాద్
25-07-2019 13:46:13
న్యూఢిల్లీ : చట్టం దృష్టిలో మహిళలంతా సమానులేనని, మతంతో సంబంధం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్
బిల్లును లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుపై రాజకీయాలు చేయరాదని తెలిపారు. భర్త తన భార్యకు తక్షణం
మూడుసార్లు తలాక్ చెప్పి, ఆమెకు విడాకులు ఇవ్వడం మతపరమైన అంశం కాదన్నారు. ఇది భారతీయ ముస్లిం మహిళల గౌరవ, మర్యాదలకు
సంబంధించిన విషయమని వివరించారు.
షరియా చట్టం ప్రకారం సరైనది కానిదానిని సాధారణ చట్టంలో కూడా సరిదిద్దవలసి ఉందన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, ఒక
న్యాయమూర్తి ట్రిపుల్ తలాక్ నిరంకుశమైనదని, రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని చెప్పారన్నారు. మరొక న్యాయమూర్తి ట్రిపుల్ తలాక్ చట్ట
ప్రకారం తప్పు అని పేర్కొన్నారన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా ఓ చట్టాన్ని ఆమోదించాలని మరొక న్యాయమూర్తి చెప్పారన్నారు.
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళకు ఆమె భర్త విడాకులు ఇచ్చిన విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. తన పళ్ళను పొగాకుతో తోముకోవడం
బానో అనే మహిళకు అలవాటని, దీనిని వ్యతిరేకించిన ఆమె భర్త ఆమెకు తక్షణం మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులిచ్చేశాడని పేర్కొన్నారు. తన
భర్త, అతని తరపు బంధువులు తనను కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఆరోపించారని పేర్కొన్నారు. ఆమెకు వివాహం జరిగి ఏడు నెలలైందని
చెప్పారు.
దాదాపు 20 దేశాలు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాయని, లౌకికవాదాన్ని అనుసరిస్తున్న భారత దేశం ఆ పని ఎందుకు చేయకూడదని
ప్రశ్నించారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడరాదన్నారు. ఇది మతపరమైన సమస్య కాదని, భారతీయ ముస్లిం మహిళల గౌరవ, మర్యాదలకు
సంబంధించిన విషయమని తెలిపారు. మతంతో సంబంధం లేకుండా, చట్టం దృష్టిలో మహిళలంతా సమానులేనన్నారు. ముస్లిం మహిళలను వారి విధికి
వారిని ఎందుకు వదిలిపెట్టాలని నిలదీశారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పినప్పటికీ, ఆ తీర్పు వెలువడిన తర్వాత ఈ నెల 24
వరకు 345 తక్షణ ట్రిపుల్ తలాక్ కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. స్త్రీ, పురుషులకు సమాన న్యాయం జరగాలన్నారు. అదే తమ ప్రభుత్వ
లక్ష్యమని తెలిపారు.
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2019ను క్లుప్లంగా ట్రిపుల్ తలాక్ బిల్లు అంటున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ,
టీఎంసీ, డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు ఈ బిల్లును పంపించాలని డిమాండ్ చేశాయి.
ఎన్డీయే భాగస్వామి జేడీయూ సంచలన నిర్ణయం
25-07-2019 14:03:04
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై అధికార కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టిన ఈ
బిల్లును వ్యతిరేకించాలని జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) నిర్ణయించింది. దీంతో కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఈ బిల్లుపై మద్దతును
కూడగట్టడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని జేడీయూ నేతలు చెప్తున్నారు.
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్ టీ హాసన్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాను వ్యతిరేకమని చెప్పారు. మతపరమైన అంతర్గత విషయాల్లో ప్రభుత్వం
జోక్యం చేసుకోరాదని హితవు పలికారు. అబు హనీఫాను అనుసరించే ఓ చిన్న తెగవారు మాత్రమే ట్రిపుల్ తలాక్‌ను పాటిస్తారని, ఈ తెగకు చెందినవారని
నిఖా రిసీప్ట్‌లో ఉంటే, విడాకులపై నిర్ణయాన్ని మహిళకు, ఆమె తల్లిదండ్రులకు వదిలిపెట్టాలని అన్నారు.
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2019ను క్లుప్లంగా ట్రిపుల్ తలాక్ బిల్లు అంటారు.
‘ట్రిపుల్ తలాక్ చట్టం వివక్షపూరితంగా ఉంది’
Jul 25, 2019, 15:30 IST
MP Mithun Reddy Comments On Triple Talaq Bill In Lok Sabha - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వివాహమనేది సివిల్ కాంట్రాక్ట్ అయినపుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలు శిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని.. విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతరకరమన్నారు.
ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా సాధికారికతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మిథున్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

No comments:
Post a Comment