"ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే
ఉమ్మడి పౌరస్మృతిని అందరూ ఆమోదించాలి"
ఈరోజు FBలో నా పోస్టు,
*ఈ సారి కొంచెం భిన్నంగా ఆలోచిద్దాం*
ప్రతిసారి లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక ముస్లిం సమస్యను ముందుకు తెచ్చి పెద్ద చర్చను మొదలెట్టడం బిజెపి ఎత్తుగడ. మనం ఆ ఉచ్చులో పడిపోతాం. బిజెపికి అవసరమైన ఓటు పోలరైజేషన్ జరిగిపోతుంది.
2028 ఎన్నికలకు ముందు బిజెపి ట్రిపుల్ తలాక్ రద్దు అంశాన్ని బిజెపి ముందుకు తెచ్చింది. దాన్ని వ్యతిరేకించేవాళ్లను అది అనాగరికులుగా చిత్రించి ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ముస్లిం మహిళలు సహితం తమ పక్షం అని ప్రచారం చేసుకుంది.
ఈసారి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చింది. నిజానికి ఇది కేవలం ముస్లింల అంశం మాత్రమేకాదు. అనేకానేక ఇతర సమూహాల సమస్య కూడ. దాని కోసం ముస్లింలు మాత్రమే రోడ్డెక్కడం తెలివి తక్కువ పని.
ఇప్పుడు మాట్లాడాల్సింది హిజాబ్, హలాల, హలాల్, ప్రత్యేక పౌర స్మృతి గురించి కానే కాదు.
ఇప్పుడు మాట్లాడాల్సింది మోదీ పరిపాలన వైఫల్యాల గురించి, వారు చెప్పే అబధ్ధాల గురించి, ప్రభుత్వ సంస్థాగత అవినీతి గురించి, అధిక ధరల గురించి, నిరుద్యోగం గురించి, సమాజ అశాంతి గురించి. బిజెపిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలను ఏకం చేయడం గురించి.
మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ పోస్టు పెట్టాను. వచ్చే వారం వివరంగా ఒక వ్యాసం రాస్తాను.
స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.
మీ
డానీ
No comments:
Post a Comment