Thursday, 5 July 2018

యూ టర్న్ తీసుకున్న యూపీ సర్కారు

యూ టర్న్ తీసుకున్న యూపీ సర్కారు
05-07-2018 11:19:53

మదరసా విద్యార్థులకు డ్రెస్ కోడ్ లేదు...
11.లక్నో: మదరసాల్లో చదివే విద్యార్ధులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టాలంటూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మదరసాల్లో డ్రెస్ కోడ్ పెట్టాలనే సర్కారు నిర్ణయంపై ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మదరసాల్లో చదివే విద్యార్థులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని యోచన తమ సర్కారుకు లేదని యూపీ సీనియర్ కేబినెట్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి ప్రకటించారు.
యూపీలో ఏకైక ముస్లిమ్ మంత్రి అయిన వక్ఫ్, హజ్ శాఖల మంత్రి మోహసిన్ రజా మదరసాల్లో విద్యార్థులకు డ్రెస్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించి సంచలనం రేపారు. సాధారణ పాఠశాల విద్యార్థుల లాగా కాకుండా మదరసా విద్యార్థులు కుర్తా పైజమా ధరించడం ఎందుకని అందుకే వారికి కూడా సాధారణ విద్యార్థుల్లాగా డ్రెస్ కోడ్ పెడతామని రజా ప్రకటించారు. దీంతో మదరసా విద్యార్ధులు సంప్రదాయంగా ధరించే దుస్తులను ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏమిటంటూ ముస్లిమ్ మత పెద్దలు ప్రశ్నించారు. ‘‘ఈ దేశంలో అన్ని మదరసాలు, కాలేజీల్లో చదివే విద్యార్ధుల డ్రెస్ కోడ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోజాలదు. సంస్థకు చెందిన మేనేజింగ్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. అయినా, మదరసాలపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారు...?’’ అని ముస్లిం మతపెద్ద సూఫియాన్ నిజామీ యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను సంప్రదించకుండా జూనియర్ మంత్రి మోహిసిన్ రజా డ్రెస్ కోడ్ పై ప్రకటన చేశారని కాని తమ యూపీ సర్కారుకు అలాంటి ఆలోచన లేదని లక్ష్మీనారాయణ చౌదరి వివరించారు.
Tags : madarasa, Dress Code, Students

No comments:

Post a Comment