Thursday, 28 June 2018

టోపీ వద్దన్న యోగి

టోపీ వద్దన్న యోగి


సంత్‌ కబీర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంత్‌ కబీర్‌ దాస్‌ సమాధి వద్ద ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈరోజు సంత్‌ కబీర్‌ దాస్‌ 500వ వర్థంతిని పురస్కరించుకుని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బుధవారం యోగి అక్కడికి వెళ్లారు. కబీర్‌దాస్‌ సమాధికి యోగి నివాళులర్పించేందుకు వెళ్లగా మసీదు వ్యవహారాలు చూసుకునే ఖాదిమ్‌ హుస్సేన్‌ ఆదిత్యనాథ్‌కు టోపీ పెట్టబోయారు. అయితే యోగి మర్యాదపూర్వకంగా టోపీని తిరస్కరించారు. ఖాదిమ్‌ టోపీ పెట్టబోతుండగా పెట్టనివ్వకుండా చేతులతో పట్టుకుని ఆపారు. తర్వాత ఖాదిమ్‌ కోరిక మేరకు టోపీని చేతులతో పట్టుకుని ఆయన‌ పక్కన నిల్చుని ఫొటోలు దిగారు.

సమాధిని సందర్శించుకున్నప్పుడు సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు టోపీ ఇవ్వబోయాను. కానీ ఆయన చాలా మర్యాదపూర్వకంగా తిరస్కరించారు, వద్దని నవ్వుతూ చెప్పారు అని ఖాదిమ్‌ తెలిపారు. అయితే ఆయన దాన్ని పట్టుకోవడానికి అంగీకరించారని వెల్లడించారు. యోగి చర్యపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా ప్రవర్తించడం మర్యాదకరం కాదని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతలు యోగిపై ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment