Thursday, 28 June 2018

ఇక దేవాలయాలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం

ఇక దేవాలయాలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం
28-06-2018 11:24:17

హైకోర్టు సంచలన ఆదేశాలు
నైనిటాల్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇక దేవాలయాలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. హరిద్వార్, తీర్థనగరి ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ధ్వని కాలుష్యాన్ని నివారించాలని హైకోర్టు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ లోక్ పాల్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హరిద్వార్ జిల్లాలోని బొమ్మల పరిశ్రమలో వెలువడుతున్న ధ్వని కాలుష్యంపై మహేందర్ సింగ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. హరిద్వార్ నగరంలో పారిశ్రామిక వ్యర్థాల వల్ల కాలుష్యం పెచ్చుపెరిగిపోయిందని, దీనివల్ల మంచినీరు కలుషితమవుతుందని వాయుకాలుష్యంతోపాటు ధ్వని కాలుష్యాన్ని నివారించాలని మహేందర్ సింగ్ హైకోర్టుకు సమర్పించిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు అనుమతి లేకుండా దేవాలయాలు, మసీదుల్లోనూ లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది.

No comments:

Post a Comment