మూకోన్మాదంతో ముప్పు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా?
ఎంతమాత్రమూ అనుమతించకూడదు
ఉక్కుపాదంతో అణచిపారేయాలి
సామూహిక దాడులపై కోర్టు ఆగ్రహం
రాష్ర్టాలకూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ
11 సూత్రాలను సూచించిన ధర్మాసనం
''పౌరులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోజాలరు. వారే న్యాయనిర్ణేతలు కాలేరు. కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తున్న ఈ మూకోన్మాద చేష్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. ఒకే రకమైన భావజాలం కలిగిన వ్యక్తులు బృందంగా ఏర్పడి... చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అది అరాచకానికి, అశాంతికి... అంతిమంగా ఒక హింసాయుత సమాజానికి దారి తీస్తుంది''
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 17: పిల్లలను ఎత్తుకుపోయే వాళ్లంటూ వెంటాడి, వేటాడి కొట్టి చంపడం! 'గో సంరక్షణ' పేరిట బృందాలుగా ఏర్పడి అనుమానమొస్తే చాలు చంపేయడం! 'ఇదిగో తోక... అదిగో పులి' అన్నట్లుగా సోషల్ మీడియా సందేశాలతో అమాయకులకు మరణ శాసనాలు లిఖించడం! ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు కుదరవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచక్షణారహితంగా సాగుతున్న 'మూకోన్మాద దాడుల'ను ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా బలమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. రెచ్చగొట్టేలా, అనుమానాలు రేకెత్తించేలా, బాధ్యాతారహితంగా విచ్చలవిడిగా వెలువడే సోషల్ మీడియా మెసేజ్‌లు, వీడియోలను కూడా నియంత్రించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ''అరాచకం తలెత్తినప్పుడు ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి. అసహనంతో జరిగే మూకోన్మాద దాడులు క్రమంగా సమాజాన్ని కబళించే కాలసర్పంలా మారే ప్రమాదముంది. దేశంలో ఇలాంటి హింసకు తావు లేదు'' అని తెలిపింది.
'మూకోన్మాద హత్యలకు ఇదే మందు' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 11 సూచనలు చేసింది. సామాజిక కార్యకర్తలు తెహసీన్ పూనావాలా, తుషార్ గాంధీ తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. 'చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు మీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో... కొత్తగా కనిపించిన వారిపై స్థానికులు దాడులు చేయడంతో మే నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 20 మందికిపైగా మరణించారు. ఇవన్నీ వదంతులేనని పోలీసులు, ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కొట్టి చంపడం, ఉరితీయడం వంటి హింసాత్మక ఘటనలకు స్థానికులు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల తొలి వారంలోనే రాష్ర్టాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా మంగళవారం మరోమారు ఈ పిటిషన్లపై విచారించి... నిర్దిష్టంగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 45 పేజీల ఆదేశాలను వెలువరించింది.
''పౌరులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోజాలరు. వారే న్యాయనిర్ణేతలు కాలేరు. కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తున్న ఈ మూకోన్మాద చేష్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. రాష్ర్టాలు కూడా శాంతిభద్రతలను కాపాడాలి. ఒకేవిధమైన భావజాలం ఉన్న వ్యక్తులు బృందంగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అది అరాచకానికి దారి తీస్తుంది. ఇలాంటి చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలి'' అని ధర్మాసనం ఆదేశించింది. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుతూ సమాజంలో సోదరభావం పెరిగేలా చూసే బాధ్యత రాష్ర్టాలపై ఉందని తెలిపింది. జాతి నిర్మాణం, సుపరిపాలనకు శాంతిభద్రతలే ప్రధానమని గుర్తు చేసింది. తన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ర్టాలను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
ఇలా చేయండి..
1. మూకోన్మాద దాడులు, కొట్టి చంపడం వంటి ఘటనలు జరక్కుండా తగిన చర్యలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాకు ఓ సీనియర్ పోలీస్ అధికారిని నియమించాలి.
2. ఇటీవల కాలంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగిన గ్రామాలు, సబ్-డివిజన్లు, జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుర్తించాలి.
3. ఇరుగు పొరుగు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సమన్వయంతో సమర్థంగా ఎదుర్కొనేలా తగిన వ్యూహాన్ని రచించడానికి నోడల్ అధికారులు ఈ విషయాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలి.
4. నిఘా పేరుతో దాడులు చేసేలా ప్రవర్తిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరించాలి. హింసాత్మక ఘటనలు జరక్కుండా చూడాలి.
5. మూకుమ్మడి దాడులు, కొట్టి చంపడం వంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేడియో, టీవీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇతర అధికార వెబ్‌సైట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వాలి.
6. సమాజంలో హింసకు దారితీసేలా సందేశాలు, వీడియోలు, ఇతర వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించకుండా అడ్డుకోవాలి. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై కేసు నమోదు చేయాలి.
7. బాధిత కుటుంబీకులు మరిన్ని వేధింపులకు గురికాకుండా చూడాలి.
8. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పథకం ప్రవేశపెట్టాలి.
9. ఇలాంటి కేసులపై ప్రత్యేక/ఫా్‌స్టట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపి, మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తయ్యేలా చూడాలి.
10. హింసకు పాల్పడే వారిలో భయం పుట్టేలా... దోషులకు నిర్దేశిత చట్ట ప్రకారం గరిష్ఠ శిక్ష పడేలా చూడాలి.
11. పోలీసు అధికారిగానీ, జిల్లా పరిపాలనాధికారిగానీ తన విధులు నిర్వహించడంలో విఫలమైతే... వారు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పరిగణించాలి.

No comments:
Post a Comment