Sons deserted theor parents
ఆస్తి తీసుకున్నారు... అనాధగా వదిలేశారు
Updated :16-09-2015 11:53:57
ఆస్తి తీసుకుని గెంటేశారు
ఎస్‌ఐ సహా పిల్లలపై తల్లి ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి, చెన్నై: తన బిడ్డలు ఆస్తి తీసుకుని వదిలివేయడంతో అనాథలా బతుకుతున్నానని, న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు సోమవారం నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. స్థానిక పళ్లికరైకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తొగాట్టి కుప్పు పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చింది. ఆమె నడిచే పరిస్థితి లేకపోవడంతో ఆమె బం ధువొకరు చక్రాల కుర్చీపై కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆమె కమిషనర్‌కు వినతిప త్రం సమర్పించిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ తనకు రామన్. దామోదరన్, చంద్రశేఖర్ అనే ముగ్గురు కుమారులు, శాం తి అనే కుమార్తె ఉన్నారన్నారు. కొద్ది కాలం కిందట తన భర్త మృతి చెందారని, అప్పటి నుంచి తనను ఎవరూ ఆదరించలేదన్నారు. ఆస్తి తీసుకున్న వారసులు అనాథగా వదిలేశారని వృద్ధురాలు వాపోయింది. తన కుమారుల్లో ఒకరు ఎస్‌ఐగా పనిచేస్తున్నారని తెలిపారు. తనను పోషించే విధంగా ఏర్పా ట్లుచేసేందుకు కుమార్తె, కుమారులను ఆదే శించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. విచారణ అనంతరం తగిన చర్యలు చేపట్టాలని కమిషనర్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
No comments:
Post a Comment