Thursday, 19 January 2017

Muslim Reservation is inevitable - KCR

కోటా ఖాయం
19-01-2017 01:05:59

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమే
బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు..
తమిళనాడు తరహాలో చట్టం
రాజ్యాంగ సవరణ చేయిస్తాం..
మైనారిటీలు కడు పేదలు
పిల్లల పోషణ, చదువు మాదే..
బతికుండగానే వారి తరక్కీ చూస్తా
200 మైనారిటీ గురుకులాలు ..
విద్యార్థికి రూ.1.25 లక్షల ఖర్చు
21 కోట్లతో అనాథాశ్రమం..
ఇస్లామిక్‌ అధ్యయన కేంద్రం పెడతాం
నియోజకవర్గానికి ఓ బీసీ గురుకులం
ఫూలే పేరుతో 119 స్కూళ్లు..
బడ్జెట్‌పై బీసీ ఎమ్మెల్యేలతో చర్చ
సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటన..
అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తాను బతికుండగానే రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి(తరక్కీ) చూస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల బిల్లును సభలో పెట్టనున్నట్లు ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లు అసాధ్యమేమీ కాదని, ఇందుకోసం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే ఆంక్షను సడలించుకోవాల్సి ఉందని చెప్పారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం చేసి, పార్లమెంటు ఆమోదం పొంది, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పిస్తామని ప్రకటించారు. శాసనసభలో బుధవారం ‘మైనార్టీ సంక్షేమం- ప్రభుత్వ కార్యక్రమాల’పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఒక ప్రకటన చేశారు. అనంతరం సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ మాట్లాడారు. మధ్యమధ్యలో ఉర్దూ షాయరీతో అలరించారు. జనాభా ప్రాతిపదికన వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సుధీర్‌ కమిషన్‌ నివేదికను బీసీ కమిషన అభిప్రాయానికి పంపినట్లు తెలిపారు.

బీసీ కమిషన వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి, తన అభిప్రాయాన్ని తెలియజేస్తుందన్నారు. ‘‘1994 నుంచి తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఇస్తున్రు... అదే పద్ధతిలో ఇక్కడా ముస్లిముల రిజర్వేషన్‌ చేరుస్తాం’’ అ న్నారు. ‘‘సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై కేసుంది. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్‌ అవుతది. పోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్లదీ పోతది. నాదీ పోతది’’ అన్నారు. రాష్ట్రంలో 14.5శాతం మంది ముస్లింలు ఉన్నారన్నారు. ముస్లిం మత ప్రాతిపదికన కాకుండా విద్య, ఆర్థిక వెనుక బాటుత నం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ‘‘బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెడతాం. ఈ లోగా బీసీ కమిషన జిల్లాల్లో పర్యటిస్తుంది. బిల్లును ఆమోదించగానే అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తాం’’ అన్నారు.

సబ్‌జ్యుడిస్‌ కాదు
‘‘రిజర్వేషన్లు ముస్లింలకు కాదు. ముస్లింలలోని పేద వర్గాలకు. అసెంబ్లీలో మాట్లాడటం సబ్‌జ్యుడిస్‌ కాదు’’ అ న్నారు. ‘‘నేను హిందువునే. అతిపెద్ద యాగం చేశా. పరమతసహ నం పా టించాలి అని హిందూ ధర్మమే చెబుతోంది’’ అని బీజేపీ సభ్యులకు సూచించారు.

ఉర్దూలో నీట్‌కు ప్రతిపాదనలు
నీట్‌(జాతీయ వైద్య ప్రవేశపరీక్ష)ను ఉర్దూలో నిర్వహించాలని ప్రధానికి లేఖ రాస్తానన్నారు. ‘‘ఉర్దూను 31 జిల్లా ల్లో రెండో అధికార భాషగా అమలు చేస్తాం. ఉర్దూ భాష ను అభిమానించే ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహిస్తాం. ఉర్దూ అకాడమీకి శాశ్వత భవనం కట్టిస్తాం. అకాడమీ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేం. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషనకు విరుద్ధంగా ముందుకెళ్లం’’ అన్నారు. కేజీ టు పీజీలో భాగంగా 200 స్కూళ్లు పెడుతున్నాం. ప్రస్తుతం రూ.586 కోట్లే ఖర్చవుతది. ప్లస్‌టూ దాకా చేరితే రూ.1600 కోట్లు అవుతుందని అంచనా. దేవుడి దయతో ముందుకెళ్తున్నాం. ముస్లిం అబ్బాయిలు, అమ్మాయిలు బాగుపడతారు. తెలంగాణకు మంచిపేరు తెస్తారు. నేను కూడా బతికుం డి చూస్తా’’ అన్నారు.

మౌజన్, ఇమామ్‌లకు రూ.1500
వచ్చే ఏడాది నుంచి మౌజన, ఇమామ్‌లకు రూ.1500 ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కరీంనగర్‌ లో అన్యాక్రాంతమైన 10 ఎకరాల భూమిని విముక్తి చేస్తామన్నారు. దళితులకు ఇచ్చినట్లే క్రిస్టియన్లకు ప్ర యోజనం కల్పిస్తామన్నారు. షాదీ ముబారక్‌ దరఖాస్తులను మార్చి 31లోగా పరిష్కరిస్తామన్నారు. 17 జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ మాధ్యమంలో అందించే సెల్ఫ్‌ ఫైనాన్స కోర్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఉర్దూ టీచర్ల నియామకం చేపడ తాం. మూడుసార్లు నోటిఫికేషన ఇచ్చినా నిండని పోస్టుల్లో ఉర్దూ మాధ్యమం వారితోనే భర్తీ చేస్తామన్నారు. రూ.10 కోట్లతో ఫలక్‌నుమా జూనియర్‌, డిగ్రీ కాలేజీ భవన నిర్మా ణం చేపడతామన్నారు. ఎస్సీ, ఎస్టీల్లాగే ముస్లింలకు స్వ యం ఉపాధి పథకాల కింద రుణాలు మంజూరు చేస్తామన్నారు. ‘‘గురుకులాల్లో ఒక్క విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్ష లు ఖర్చు చేస్తున్నాం. అన్ని నియోజక వర్గాల్లో గురుకులా లు పెడతాం. హైదరాబాద్‌లోనే 40 గురుకులాలు పెడుతు న్నాం. గురువారం ఎమ్మెల్యేలకు జాబితా పంపిస్తాం’’ అన్నారు. అనాథశ్రమం(అనీసుల్‌ గుర్బా)కు రూ.21 కోట్లు మంజూరు చేస్తున్నామని, ఆ భవన నిర్మాణానికి తానే శంకుస్థాపన చేస్తానన్నారు.

గంగా జమునా తెహజీబ్‌
తెలంగాణ ప్రజాజీవనంలో లౌకిక విలువల స్ఫూర్తి అడుగడుగునా వెల్లి విరుస్తోందని, అందుకే ఈ ప్రాంతాన్ని గంగా, జమునా తెహజీబ్‌గా గాంధీ అభివర్ణించారని కేసీఆర్‌ చెప్పారు. సమై క్య పాలనలో మైనార్టీలకు జరిగిన అన్యా యం 20 ఏళ్లుగా బడ్జెట్లో కేటాయింపులు చూ స్తే అర్థమవుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనారిటీల్లో అస్తిత్వం నిలబెట్టేందుకు, వారిలో ఆత్మగౌరవం నిలిపేందుకు, ఆత్మవిశ్వాసం పాదుకొల్పేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టామన్నారు. మైనారిటీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్స్‌ ద్వారా గతేడాది 463 మంది విద్యార్థులు లబ్ధిపొందారన్నారు. ఈ ఏడాది ఈ స్కాలర్‌షిప్స్‌ను రూ.20 లక్షలకు పెంచినట్లు వివరించారు.

నిరుపేదలు ముస్లిములే
‘‘31 జిల్లాల్లో ఏ ఊరికెళ్లినా పేదలెవరంటే దళితులే అనే సమాధానం వస్తది... దౌర్భాగ్యంగా బతుకుతున్నవరెవరంటే ముస్లింలే అనే జవాబు వస్తది’’ అని సీఎం చెప్పారు.‘‘హైదరాబాద్‌లో ఇస్లామిక్‌ అధ్యయన కేంద్రం/కన్వెన్షన హాలు కడతాం. 8-12 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం... ఎన్నికల్లోపు పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘రేస్‌కోర్సు, చంచల్‌గూడ జైలును తరలించి విద్యా సంస్థలను పెట్టే ప్రతిపాదనలు చేస్తున్నాం.వరంగల్‌ సెంట్రల్‌ జైలును తరలిస్తాం’’ అని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ బోర్డుకు జ్యుడీషియల్‌ అధికారాలిచ్చే బిల్లు పెడతామన్నారు.

నా వల్లే సచార్‌ కమిటీ
2004లో యూపీఏ ప్రభుత్వ తొలి సమావేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తానే ప్రతిపాదించానని కేసీఆర్‌ చెప్పారు. సోనియ, ప్రధాని మన్మోహన అనుమతితో జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ కమిటీని కేంద్రం వేసిందన్నారు. సుధీర్‌ నివేదికా ముస్లింలలోని పేదరికాన్ని ఎత్తి చూపిందని అన్నారు.

త్వరలో వక్ఫ్‌ బోర్డు
అతి త్వరలోనే వక్ఫ్‌ బోర్డు ఏర్పాటు జరగనుందని సీఎం వెల్లడించారు. వక్ఫ్‌ అనేది సెంట్రల్‌ యాక్ట్‌ అని, అది కేంద్రం చేయాల్సిన పని అని కేసీఆర్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాసినా.. కేంద్రం ఎక్కువ సమయం తీసుకుందన్నారు. బోర్డు ఏర్పాటుకు ఎన్నికలు జరగాల్సి ఉంటుందని, అతి త్వరలోనే బోర్డు ఏర్పాటు కానుందని చెప్పారు.

హోంగార్డుకు కానిస్టేబుల్‌ జీతం?
హోంగార్డులకు కానిస్టేబుల్‌తో సమానంగా వేతనం ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సభలో ముస్లిం స్థితిగతులపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయం చెప్పారు. ‘‘హోంగార్డు ఉంటడు.. కానిస్టేబుల్‌ పనేచేస్తడు.. పని చేస్తుంటే కడుపునిండా పెట్టడం ధర్మం. ఒకే పనికి ఒకే వేతనం ఇచ్చే ప్రతిపాదనలపై చర్చిస్తున్నాం’’ అని ప్రకటించారు.

సీఎంను టెంప్ట్‌ చేయకండి: ఈటల
ముస్లిం ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచాలంటూ జీవనరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దీనికి రూ. ఐదు కోట్లు వెచ్చిస్తేచాలని అన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి ఈటల స్పందిస్తూ.. ‘‘మౌజం, ఇమాంలకు రూ.5వేల చొప్పున ఇవ్వాలంటే రూ. 5 కోట్లు చాలని జీవనరెడ్డి మాట్లాడుతున్నారు. కానీ రూ.60 కోట్లవరకు అవుతుంది. లెక్క సరి చేస్తున్నాను. భోళా శంకరుడి లాంటి సీఎం కేసీఆర్‌ను తప్పుడు లెక్కలు చెప్పి టెంప్ట్‌ చేయవద్దు’’ అని అన్నారు. కాగా, తెలంగాణలో వక్ఫ్‌భూములను పరిరక్షించడంతో పాటు వక్ప్‌బోర్డు ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు.

బీసీ రుణాలపై సర్కారు దబాయింపు: జానా
బలహీన వర్గాల రుణాలకు సంబంధించి ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటన్నట్లు ఉందన్నారు. పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని.. అడిగితే సరైన సమాధానం కూడా చెప్పడం లేద్నారు. పైగా దబాయింపుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బుధవారం శాసనసభలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జానారెడ్డి ,తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈటెల సమాధానం చెప్పారు. దీనిపై జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, మైనార్టీలకు జనాభా ఆధారంగా సబ్‌ప్లాన రూపొందించాలని, బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉపనేత జీవనరెడ్డి డిమాండ్‌ చేశారు. మజ్లిస్‌ సభ్యుడు అక్బరుద్దీన ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు తెలంగాణలో ముస్లింలకు చారిత్రక దినం. ప్రభుత్వం నిధులిచ్చినా అధికారులు నిధులు ఖర్చు చేయడంలేదు’’ అని అన్నారు. కాగా, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ పక్ష నేత కిషనరెడ్డి తెలిపారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

కేసీఆర్‌ నోట ఉర్దూ కవితలు
ఇమాబ్‌లు, మౌజన్‌ల వేతనాలను రూ.1000 నుంచి రూ.1500కు పెంచుతున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ‘‘గత 70 ఏళ్లలో ఇమామ్‌, మౌజనల గురించి విన్నామా? తెలంగాణ వచ్చాక రూ.1000 ఇస్తున్నాం. 5000 అడిగే వాళ్లు ఎన్ని కబుర్లయినా చెబుతారు’’ అంటూ షాయరీ(ఉర్దూ కవితలు) వినిపించారు. ‘క్యా హసీ అతీహై ముజ్‌కో... హజరతే ఇనసాన పర్‌.... కారే బత్తో ఖుద్‌కరే... లానత కరో సైతాన పర్‌’ అన్నారు. మొత్తం సంక్షేమాన్ని విస్మరించి, ఈ పరిస్థితిని సృష్టించిన కాంగ్రెస్‌ తమ మీద నెపం పెట్టడం ధర్మం కాదన్నారు. ‘‘చలేతో సాత చలో హాయాత లేకే చలో...ఖాయినత లేకే చలో... చలేతో సారే జమానేకు లేకే చలో’’.... అంటూ ‘‘వంద శాతం కమిట్‌మెంట్‌తో ఉన్నాం. అందర్నీ అందరినీ కలుపుకొని వెళ్లాలన్నదే మా విధానం’’ అని చెప్పారు. ‘‘యా అల్లా కరం కరే సునాహేరా తెలంగాణ హర్‌ కీసీకహో (బంగారు తెలంగాణ ప్రతీ ఒక్కరిది కానీ) అంటూ ప్రార్థించారు.

నియోజకవర్గానికి ఓ బీసీ గురుకులం: సీఎం
బీసీల అభ్యున్నతికి కృషిచేసిన మహాత్మా జ్యోతి బా ఫూలే పేరుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో బుధవారం ప్రకటించారు. ఈ స్కూళ్లలో 76,160 మంది విద్యార్థులు మంచి విద్యను పొందగలుగుతారన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రం లో ఎస్సీలకు 125, ఎస్టీలకు 51 గురుకుల పాఠశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. మైనారిటీలకూ రెండొందల రెసిడెన్షియల్‌ స్కూ ళ్లు మంజూరు చేసి 71 స్కూళ్లను గతేడాదే ప్రారంభించామన్నారు

బడ్జెట్‌పై నెలాఖరులో సీఎం చర్చలు
బడ్జెట్‌ రూపకల్పనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎమ్మెల్యేలతో ఈ నెలాఖరులోపు చర్చిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ప్రణాళిక, ప్రణాళికేతరాలు లేకుండా వచ్చే బడ్జెట్లో కేంద్రం కొత్త పంథా అనుసరిస్తోందని, రాష్ర్టాలూ అనుసరించాలని సూచించిందన్నారు

No comments:

Post a Comment