ఓంపురి మృతి వెనుక మోదీ!
10-01-2017 03:04:25
పాక్ చానల్ హాస్యాస్పద కథనం
న్యూఢిల్లీ, జనవరి 9: విలక్షణ నటుడు ఓంపురి మృతి వెనుక ప్రధాని మోదీ, జాతీయ భద్రత సలహాదారు అజిత దోవల్ హస్తం ఉందట! ఓంపురికి ఒళ్లు తెలియనంత స్థాయిలో బలవంతంగా మద్యం తాగించి.. ఆయన ముఖం మీద దిండు వేసి నొక్కి చంపేశారట. ఈ పని చేసింది అజిత దోవల్ ప్రతినిధి అట. పాకిస్థాన్‌కు చెందిన బోల్ టీవీ అనే చానల్ ప్రసారం చేసిన ‘ఐసే నహీ చలేగా’ అనే హాస్యాస్పద కథనమిది. ఓంపురి పాకిస్థానీ కళాకారులకు మద్దతుగా మాట్లాడటమే దారుణ ‘హత్య’కు కారణమని ఆ చానల్ కథనం పేర్కొంది. ఓంపురిని తనవద్దకు రావాల్సిందిగా దోవల్ ఇటీవలే ఆజ్ఞాపించారని, ఆయన అక్కడికి వెళ్లాక దుస్తులు ఊడదీసి, చితక్కొట్టారని.. ఉరీ అమరజవాను నితిన్ యాదవ్ గ్రామానికి వెళ్లి సైనికులపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారని వివరించింది. ఓంపురి మృతదేహంపై ఆయన్ను చంపిన వ్యక్తి ఆనవాళ్లు ఉన్నాయని.. దగ్గరుండి చూసినట్టు రిపోర్ట్ చేసింది. మోదీ తదుపరి లక్ష్యం పాక్ నటుడు ఫవాద్‌ఖాన్, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ అని పేర్కొంది. వారిద్దరూ ముస్లింలు కావడమేనట!
No comments:
Post a Comment