Saturday, 21 January 2017

'జల్లికట్టు'.. 'హిందుత్వ'కు చెంపపెట్టు: అసదుద్దీన్‌

'జల్లికట్టు'.. 'హిందుత్వ'కు చెంపపెట్టు: అసదుద్దీన్‌
Others | Updated: January 20, 2017 15:36 (IST)
'జల్లికట్టు'.. 'హిందుత్వ'కు చెంపపెట్టు: అసదుద్దీన్‌
హైదరాబాద్‌: జల్లికట్టు ఆందోళనల నేపథ్యంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తేయాలని తమిళులు చేస్తోన్న ఆందోళన హిందూత్వ శక్తులకు చెంపపెట్టు లాంటిదని ఒవైసీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, రకరకాల జాతులు, మతాలకు చెందినవారు తమతమ సంప్రదాయాలు పాటిస్తారని, అయితే ఈ స్ఫూర్తికి భిన్నంగా హిందుత్వ శక్తులు ఉమ్మడి పౌరస్మృతిని తేవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేస్తోన్న ఆందోళన.. ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఎన్నటికీ సాధ్యం కాదనే వాదనకు బలం చేకూర్చుతుందని అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జల్లికట్టును, దానిని పాటించే తమిళ ప్రజలను పరిగణలోకి తీసుకోకుండా చట్టాలు అమలుచేసినట్లే.. ముస్లింల జీవనవిధానంపైనా బలవంతపు చట్టాలు రుద్దుతున్నారని, ఇలాంటి చర్యలు దేశానికి మంచివి కావని ఒవైసీ వ్యాఖ్యానించారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని తమిళనాడు వ్యాప్తంగా చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. పలు రాజకీయ, సినీ ప్రముఖులు ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు.
 Follow
 Asaduddin Owaisi @asadowaisi
#Jallikattuprotest Lesson for Hindutva forces,Uniform Civil Code cannot be "imposed"this nation cannot have one CULTURE we celebrate all
9:04 AM - 20 Jan 2017
  584 584 Retweets   1,206 1,206 likes
చెరఖాను ఎలా తిప్పుతారు?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతోన్న అసదుద్దీన్‌.. గురువారం షహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఖాదీ క్యాలెండర్‌పై మోదీ ఫొటోను గురించి మాట్లాడుతూ.. 'సాధారణంగా చెరఖాను రెండు చేతులు ఉపయోగించి తిప్పుతారు. కానీ మన మోదీ మాత్రం ఒక్కచేత్తో చెరఖాను తిప్పేస్తున్నారు. ఇదీ.. చెరఖా వాడకంపట్ల అతనికున్న జ్ఞానం! మన అదృష్టం ఏంటంటే.. ఎర్రకోట, తాజ్‌మహల్‌లు శతాబ్దాల కిందటే నిర్మాణమయ్యాయి. అవిగానీ నిన్నో, మొన్నో నిర్మించనవైతే, వాటిని కూడా నేనే కట్టానని మోదీ గప్పాలు చెప్పుకునేవారు'అని విమర్శించారు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు ఒక నాణేనికి రెండు వైపుల లాంటివని, ఇద్దరివీ పేదలు, ముస్లిం వ్యతిరేక విధానాలేనని అన్నారు


ఓట్ల కోసమే ముస్లిం రిజర్వేషన్లు
Sakshi | Updated: January 21, 2017 04:39 (IST)
ఓట్ల కోసమే ముస్లిం రిజర్వేషన్లు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజం

సాక్షి, కొత్తగూడెం: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కోవ లక్ష్మణ్‌ అన్నారు. రెండు రోజులపాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమైనందున బీజేపీ రాజకీయంగా, న్యాయపరంగా దీనిని అడ్డుకుంటుంద న్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అసదుద్దీన్‌ వ్యాఖ్యలు సరికాదు
జల్లికట్టుపై ఎంఐఎం పార్టీ వివాదం చేయడం సరికాదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. జల్లికట్టుపై ఆందోళనలు తమిళుల సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. దీనిపై హిందూత్వానికి పెద్దదెబ్బ, వీహెచ్‌పీ వారికి చెంపపెట్టు అని అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించడం చూస్తే.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.


మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
22-01-2017 03:04:06
అంబేద్కర్‌ను అవమానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: హన్సరాజ్‌
ముగిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
భద్రాచలం/కొత్తగూడెం, జనవరి 21: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ అన్నారు. మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వాల్సిందిగా రాజ్యాంగంలో పేర్కొనలేదని, కేసీఆర్‌ ప్రభుత్వ చర్య రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించడమే అన్నారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు రోజై న శనివారం ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం భారీ గా నిధులిచ్చినా ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దేశంలో అతి పె ద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, కాంగ్రెస్‌ పని ముగిసిందని, రాష్ట్రంలోనూ టీఆర్‌ఎ్‌్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను సీనియర్‌ నాయకు లు, కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో గెలిచి మోదీకి కానుకగా ఇద్దామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు కృష్ణదాస్‌, బీజేఎల్పీ నేత జి.కిషనరెడ్డి, పార్టీ జాతీయ కమిటీ సభ్యులు నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన.రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment