న్యాయం జరిగేనా?
25-01-2020 01:08:01
మయన్మార్ సైన్యం చేతిలో ఊచకోతలకు గురవుతున్న రొహింగ్యాలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) రక్షణగా నిలిచినందుకు సంతోషించవలసిందే. రొహింగ్యాలపై సాగుతున్న మారణకాండను తక్షణం నిలువరించేందుకు అన్ని చర్యలూ తీసుకోమని మయన్మార్ ప్రభుత్వాన్ని ఐసీజే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఎటువంటి కార్యాచరణ చేపడుతున్నారో, దాని ప్రభావం ఏ మేరకు ఉన్నదో తెలియచేస్తూ ప్రతీ ఆర్నెల్లకూ తనకు నివేదికలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ శతాబ్దపు అతిపెద్ద మానవహననంపై ఐసీజే ఇచ్చిన ఈ ఆదేశాలు యావత్ ప్రపంచానికీ ఎంతో సంతోషం కలిగించినప్పటికీ, మయన్మార్ ఈ తీర్పును అన్యాయం, అక్రమం అంటూ తప్పుబడుతున్నదే తప్ప ఆచరణకు సిద్ధపడటం లేదు.
దాదాపు నెలరోజుల విచారణ తరువాత వెలువడిన మధ్యంతర ఆ దేశం ఇది. ముస్లిం దేశాల తరఫున గాంబియా దాఖలు చేసిన కేసులో ఐసీజే ప్రాథమికంగా మయన్మార్‌లో మానవహననం జరుగుతున్నట్టుగా నిర్థారణకు వచ్చింది. మయన్మార్ ఎన్ని చెప్పినా, ఐసీజే తీవ్ర పదజాలంతో రొహింగ్యాలపై సాగుతున్నది రాజ్యహింసే, జరుగుతున్నది మానవహననమేనని విస్పష్టంగా ప్రకటించింది. ఐసీజే ఉత్తర్వులను పాటించాల్సిన బాధ్యత సభ్యదేశాలపై ఉన్నప్పటికీ, అవి అమలయ్యేట్టు చూసే వ్యవస్థలేవీ ఐసీజేకు లేనందున సదరు ఆదేశాలను మయన్మార్ ఖాతరు చేయకపోవచ్చునని ముందుగా ఊహించిందే.
ఐసీజేలో మయన్మార్ అడ్డగోలు వాదనలు ఈ అభిప్రాయానికి మరో కారణం. 2017లో మయన్మార్ సైన్యం రొహింగ్యా తెగవారిమీద విరుచుకుపడి వేలాదిమందిని ఊచకోత కోసింది. బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడి, పిల్లలను, పసికందులను బండలకు కొట్టి చంపినట్టు కేసు విచారణ సందర్భంగా పలువురు మహిళలు వాంగ్మూలం ఇచ్చారు. అక్కడ జరిగిన అఘాయిత్యాలకు, ఊచకోతలకు ఆధారాలు మిగల్చకూడదన్న ఉద్దేశంతో వందలాది గ్రామాలను సైన్యం తగులబెట్టిందని వారి వాదన. ఉపగ్రహ చిత్రాల వంటి పలు ఆధారాలతో గాంబియా ఈ మానవహననాన్ని రుజువుచేయగలిగింది కూడా.
కానీ, మయన్మార్ పాలకురాలు ఆంగ్ సాంగ్ సూకీ విచారణ సందర్భంగా తన సైన్యాన్ని సమర్థిస్తూ అర్థంలేని వాదనలు చేశారు. తమ సైనికులపైనా, పౌరులపైనా తరచూ దాడులకు పాల్పడుతున్న ‘అరాకన్ రొహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ (అర్సా)ని తిప్పికొట్టేందుకు సైన్యం ప్రయత్నించిందే తప్ప, అఘాయిత్యాలకు ఒడిగట్టలేదని చెప్పుకొచ్చారు. దాదాపు నలభైనిముషాల పాటు సైన్యాన్ని వెనకేసుకొస్తూ ఈ నోబెల్ శాంతి బహుమతి విజేత చేసిన వాదనలు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించడం సహజం. ప్రజాస్వామ్యం, మానవహక్కుల పక్షాన నిలిచి, సుదీర్ఘకాలం మిలటరీ పాలనలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడు ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించిన ఒక దారుణాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చారు. ఇప్పటికీ సైన్యానిదే పైచేయిగా ఉన్న మయన్మార్‌లో, విస్తృతాధికారాలు లేక, స్టేట్ కౌన్సిలర్ హోదాలో కొనసాగుతున్న ఆమె సైన్యానికి వ్యతిరేకంగా నోరువిప్పలేని దుస్థితిలో జారిపోయారు.
అప్రదిష్టనుంచి బయటపడేందుకు స్వతంత్ర దర్యాప్తు కమిషన్ పేరిట మయన్మార్ ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. కొంతమంది సైనికాధికారుల కారణంగా కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట నిజమేనని అంగీకరిస్తూనే, వాటిని యుద్ధనేరాలు, మానవహక్కుల ఉల్లంఘనలుగా సదరు విచారణ కమిషన్ పేర్కొంది. దేశంలో జరుగుతున్నది అంతర్యుద్ధమే తప్ప, హననం కాదని మయన్మార్ చెబుతున్నది. కానీ, ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ ఇత్యాదివి చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
రొహింగ్యా ముస్లింల ఊచకోత వెనుక ఉన్న మతకారణాలను అటుంచితే, వారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు మయన్మార్ సైన్యం కంకణం కట్టుకున్నమాట నిజం. చైనా పెట్టుబడులు, ప్రయోజనాల కోసమే రఖైన్‌ను మయన్మార్ ఖాళీచేయిస్తున్నదన్న వాదనలూ ఉన్నాయి. రొహింగ్యాల పక్షాన నిలిస్తే సైన్యానికీ, ప్రజలకూ దూరమవుతానన్న భయం సూకీది. ఐసీజే విచారణలో మయన్మార్ తరఫున వాదించిన బృందానికి స్వయంగా నాయకత్వం వహించి, రొహింగ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా సూకీ తన ప్రజల మనసు గెల్చుకొని ఉండవచ్చునేమో గానీ, అంతర్జాతీయంగా అప్రదిష్టపాలైన మాట నిజం.

No comments:
Post a Comment