‘ఒకదేశం - ఒక భాష’ అసాధ్యం : జైరాం రమేశ్
16-09-2019 09:25:18
బెంగళూరు : భారతదేశంలో కారణం ఏదైనా ‘ఒక దేశం - ఒక భాష’ అమలు చేయడం అసాధ్యమని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఆదివారం ఎఫ్‌కేసీసీఐ సంస్థాపనా దినోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నట్టుగా ‘ఒక దేశం - ఒక భాష’ అమలు చేయడం ఎప్పటికీ సాధ్యం కాదని తిప్పికొట్టారు. దేశంలో విభిన్న భాషలు, ప్రాంతాల వారీగా సంస్కృతి శతాబ్దాల కా లంగా కొనసాగుతోందని అటువంటి సం ప్రదాయమైన దేశంలో ఒకే భాష అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ‘ఒక దేశం - ఒక పన్ను’ జీఎస్టీ అమలు చేశారనేది నిజమే అయినా భాష విషయంలో కష్టమన్నారు. విభిన్న భాషలు సంస్కృతులు వైవిధ్యమైన ఐక్యతను మార్చాలనుకుంటే పొరపాటు చేసినట్టేనన్నారు.

No comments:
Post a Comment