Sunday, 15 September 2019

కేంద్ర హోంశాఖ అత్యవసర భేటీ

కేంద్ర హోంశాఖ అత్యవసర భేటీ
16-09-2019 10:56:12

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, హోంశాఖ కార్యదర్శి ఏకే భల్లా, ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాద కార్యకలాపాలు, జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం. మావోల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంపైనా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment