Sunday, 15 September 2019

మజ్లిస్‌ నేతలకు భయపడుతున్న కేసీఆర్‌

మజ్లిస్‌ నేతలకు భయపడుతున్న కేసీఆర్‌
16-09-2019 05:38:44

అందుకే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు
భవిష్యత్‌లో కేంద్రం ఆధ్వర్యంలో విమోచనాన్ని నిర్వహిస్తాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి
విమోచన దినానికి కులాలు, మతాలుండవు
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ
స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్యసమాజ పెద్దలకు ఘన సన్మానం
హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మజ్లిస్‌ పార్టీ నేతలకు భయపడి సీఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆర్య ప్రతినిధి సభ ఏపీ, తెలంగాణ ఆధ్వర్యంలో నిజాం రాష్ట్ర స్థాయి హైదరాబాద్‌ విమోచన దినోత్సవ మహాసభను ఆదివారం నగరంలోని ఉమానగర్‌ వైదిక ఆశ్రమ కన్యాగురుకులంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్య సమాజ వృద్ధ నాయకులు 230 మందిని ఘనంగా సన్మానించి వారికి మెమొంటోలు అందజేశారు. అనంతరం ప్రధాన్‌ సభ ఠాకూర్‌ లక్ష్మణ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆర్యసమాజ్‌ ఎంతో కృషి చేసిందని తెలిపారు. నిజాం నియంతృత్వ పాలన నుంచి నాటి హైదరాబాద్‌ రాష్ర్టానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఆర్య సమాజ్‌ నేతలు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యతోపాటు ప్రస్తుత సీఎం కేసీఆర్‌ వరకూ అందరూ మజ్లిస్‌ పార్టీ నేతలకు భయపడుతున్నారని ఆరోపించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now
మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని నాటి ప్రభుత్వాలపై ఎదురుతిరిగి ప్రజలను ఉసిగొల్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం విమోచనాన్ని అధికారికంగా నిర్వహించే వరకూ ఆందోళనలు ఆగవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకుంటే.. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని, పాఠ్యాంశాల్లో తెలంగాణ విమోచన చరిత్రను ప్రవేశపెడతామని చెప్పారు.

ఖాసీం రజ్వి ఎన్నో అరాచకాలు చేశాడు : దత్తాత్రేయ
నిజాం రాజులకు చెందిన ఖాసీం రజ్వీ నాటి తెలంగాణ ప్రజలపై ఎన్నో అరాచకాలు, దురాగతాలకు పాల్పడ్డాడని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. నిజాం రాజుల కబంద హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు ఆర్యసమాజం కీలకపాత్ర పోషించిందన్నారు. ఆర్యసమాజ్‌కు చెందిన నారాయణపవార్‌, జగదీష్‌ ఆర్యలాంటి వారు నిజాంలపై బాంబులు విసిరి జైలు పాలయ్యారని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి కులాలు, మతాలతో సంబంధం లేదని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని సూచించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

ఆర్య సమాజం సేవలు మరువలేనివి: వివేక్‌
నిజాం రాజు నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఆర్యసమాజం చేసిన సేవలు మరువలేనివని మాజీ ఎంపీ వివేక్‌ అన్నారు. ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆర్యసమాజ్‌ ప్రముఖ సంత్‌ నిర్మలయోగ భారతి, డాక్టర్‌ ఆనందరాజ్‌వర్మ, డాక్టర్‌ చంద్రశేఖర్‌ లోఖండే, కిశోరీలాల్‌ వ్యాస్‌, ఆర్‌.రాజ్యలక్ష్మి, యశ్వంత్‌రావు సాయిగావ్‌కర్‌, సదావిజయ్‌, కైలాష్‌ కర్మఠ్‌, విఠల్‌రావు ఆర్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment