Sunday, 15 September 2019

అవసరమైతే యూపీలోనూ ఎన్ఆర్సీ: సీఎం యోగి

అవసరమైతే యూపీలోనూ ఎన్ఆర్సీ: సీఎం యోగి
16-09-2019 11:56:15

లక్నో: అస్సాంలో మాదిరే యూపీలోనూ జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. కోర్టు ఆదేశాలతో అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని మోదీని అభినందించాల్సిందేనన్నారు. ఇలాంటి వాటిని దశలవారిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ యూపీలో కూడా ఎన్ఆర్సీ అవసరమైతే కచ్చితంగా అమలు చేస్తామన్నారు. అక్రమ వలసలకు అడ్డకట్ట వేయడానికి, దేశభద్రతకు ఇది ఎంతగానో అవసరమన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. తమ రాష్ట్రంలో కూడా అతి త్వరలో పౌరజాబితా రూపొందిస్తామన్నారు.

No comments:

Post a Comment