Sunday, 15 September 2019

భారత్‌తో సంప్రదాయ యుద్ధం రావచ్చు: ఇమ్రాన్‌

భారత్‌తో సంప్రదాయ యుద్ధం రావచ్చు: ఇమ్రాన్‌
16-09-2019 01:14:12
  • వస్తే.. పాక్‌ ఓడిపోయే అవకాశాలే ఎక్కువ
  • అణు యుద్ధాన్నీ తోసిపుచ్చలేమన్న పాక్‌ ప్రధాని
ఇస్లామాబాద్‌, సెప్టెంబరు 15: భారత్‌తో సంప్రదాయ యుద్ధం వచ్చే అవకాశం ఉందని పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌తో చర్చల ప్రసక్తే లేదన్నారు. యుద్ధమే మొదలైతే అది అణుయుద్ధానికి దారి తీసి, ప్రాంతీయ సమస్యగా మారుతుందన్నారు. అందుకే తాము ఐరాసను ఆశ్రయించామన్నారు. ‘అల్‌ జజీరా’ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పాకిస్థాన్‌ ఎన్నడూ యుద్ధాన్ని ప్రారంభించదని స్పష్టం చేశారు. భారత్‌తో సంప్రదాయ యుద్ధం జరిగితే తమ దేశం ఓడిపోయే అవకాశాలే ఎక్కువని ఇమ్రాన్‌ అంగీకరించారు.

No comments:

Post a Comment