Tuesday, 25 December 2018

క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు

క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
25-12-2018 12:29:33

విజయవాడ: క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నగరంలోని నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. రూ.100కోట్లతో శ్మశాన వాటికల ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెల్లకార్డులు ఉన్నవారందరికీ చంద్రన్న క్రిస్మస్‌ కానుకలు అందజేస్తామని సీఎం తెలిపారు. జెరూసలెం యాత్రలకు రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నామని, క్రైస్తవ యువతుల పెళ్లికి రూ.50వేలు ఆర్థికసాయం అందజేయనున్నట్లు చెప్పారు. క్రిస్టియన్‌ దళితులందరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment