Sunday, 2 December 2018

‘పక్షిరాజ’కు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా.?

‘పక్షిరాజ’కు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా.?
Updated : 02-Dec-2018 : 20:22

సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లు ప్రధాన పాత్రలో.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’. గురువారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరిని ఆకర్షించిన పాత్ర ‘పక్షిరాజ’. సినిమా అంతా ఒక ఎత్తైతే.. ఈ పాత్ర ఒకటి ఒకెత్తు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తమిళనాడుకి చెందిన పక్షి ప్రేమికుడు సలీం అలీని ఆదర్శంగా తీసుకొని ఈ పాత్రను సృష్టించారు దర్శకుడు శంకర్.

అదేస్థాయిలో పక్షిరాజ మేకప్ కూడా ఉంది. మొబైల్ ఫోన్లన్ని కలిసి పక్షిరాజు రెక్కలుగా మారడం.. అతని ముఖంపై పక్షికి ఉన్న విధంగా ఈకలు ఉండటం.. ఇలా ఈ గెటప్‌లో ప్రతీది నిజంగా పక్షిని తలపించేలా మేకోవర్ చేశారు.

అయితే ఈ గెటప్‌కి రామాయణంలోని పక్షిరాజైన ‘జటాయువు’ రూపాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలోని ‘పక్షిరాజ’ పాత్రని రూపొందించారు. ఈ విషయం తెలుపు ఫిలిమ్ కరస్పాండెంట్ రాజశేఖర్ ట్వీట్ చేశారు. ‘‘ఎడమవైపు చిత్రంలో ఉన్న పక్షిరాజైన జటాయువు.. కుడివైపు ఉన్నని భయంకరమైన అక్షయ్ కుమార్ పక్షిరాజ లుక్. ఇది చూస్తే శంకర్ డీటేలింగ్ ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది’’ అని ఆయన రెండు చిత్రాలతో కలిపి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

No comments:

Post a Comment