అసద్ టీఆర్ ఎస్ - అక్బర్ మహాకూటమి
02-12-2018 04:04:04
కర్ణాటకలో కుమారస్వామే ఆదర్శం
ఎనిమిది సీట్లు గెలిస్తే మనమే సీఎం
పాతబస్తీ సభల్లో అక్బర్ వ్యాఖ్యలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘‘డిసెంబరు 11 తర్వాత చక్రం తిప్పుతాం.. ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేస్తం. అంతా సవ్యంగా జరిగితే మ నమే ముఖ్యమంత్రి అవుదాం.. మనమే ఉద్యోగాలు ఇద్దాం...’’ ఈ మాటలన్నది ఎవరో కాదు. ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పలు దఫాలుగా జరిగిన బహిరంగసభలో ఈయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపన లు సృష్టిస్తున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 38 స్థానాలు గెలిచిన జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయినప్పుడు 8 స్థానాలు గెలుచుకుంటే తానెందుకు ముఖ్యమంత్రి కాలేనని అక్బర్ అంటున్నారు. అక్బర్ ప్రకటనలు మజ్లిస్ మిత్రపక్షమైన టీఆర్‌ఎ్‌సకు మింగుడు పడటం లేదు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ మొదలవగానే హంగ్ ఏర్పడుతోందని గ్రహించిన కాంగ్రెస్ మెరుపువేగంతో స్పందించింది. బీజేపీని అధికారంలో రానీయకుండా చూసేందుకు జేడీఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. మహాకూటమి సాధారణ మెజారిటీకి ఆరేడు సీట్ల దూరంలో ఆగిపోతే తెలంగాణలోనూ కర్నాటకం రిపీట్ అవుతుందని అక్బర్ ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, సీఎం కేసీఆర్ కా వాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒకపక్క రాష్ట్రమంతటా తిరిగి ప్రచా రం చేస్తుంటే మరోపక్క తమ్ముడు అక్బరుద్దీన్ భిన్నమైన ఎజెండాను ఉంచుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీతో మం చిగా ఉండి పని చేయించుకోవడానికి బదులు మనమే అధికారానికి వద్దామని సభల్లో పిలుపునివ్వడంతో అందరి దృష్టీ ఒక్క సారిగా ఎంఐఎం మీద పడింది. అక్బర్ ప్రకటనలపై ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ స్పందించలేదు.

No comments:
Post a Comment