ట్రిపుల్ తలాక్‌తో బీజేపీ ఓటు రాజకీయం
25-12-2018 02:32:59
బిల్లుపై పోరాటానికి సహకరిస్తాం
ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో సీఎం
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘ట్రిపుల్ తలాక్’ వ్యవహారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. సోమవారం ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశమైంది. పార్లమెంటులో ఈ నెల 27న తీసుకొస్తున్న ముస్లిం మహిళా బిల్లు-2018ను వ్యతిరేకించి కోట్లాది భారతీయ ముస్లింల హక్కులను కాపాడాలని ఆయన్ను కోరింది. ముస్లింలకు మొదటి నుంచీ అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇస్లాం ప్రబోధానుసారం ముస్లిం వర్గాల్లో 1400 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహ వ్యవస్థను మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని, దీన్ని అత్యధిక రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రతినిధులు తెలిపారు.
ముస్లిం సమాజంలో భర్తను శిక్షించే కొత్త చట్టాన్ని తీసుకురావడం మానవ హక్కులకు ప్రతిబంధకమని, రాజ్యాంగ విరుద్ధమే కాకుండా సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని చెప్పారు. దీనిని కేంద్రం ఓటు బ్యాంకు రాజకీయ అంశంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ పార్టీ కూడా భావిస్తోందని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అన్నీ విధాలుగా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతినిధి బృందంలో బోర్డు కార్యదర్శులు మౌలానా ఖలీద్ సైపుల్లా, జాఫర్ జిలానీ, మహిళా విభాగం చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ అస్మా జహేరా, మౌలానా అబ్దుల్ బాసిత్, మౌలానా అసిఫ్ నద్వీ, ఫరూకీ ఖస్మీ, సైదా ఆయేషా తయ్యబా తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment