సొంతంగా 280 సీట్లు రావు -
02-12-2018 03:15:57
కాంగ్రెస్, బీజేపీలపై అసదుద్దీన్ ఆగ్రహం
ఏపీలో ఆ పార్టీలకు ఒక్క ఎంపీ సీటూ రాదు
జాతీయ మీడియాతో ఎంఐఎం అధినేత ఒవైసీ
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీజేపీ సొంతంగా 280 స్థానాలు గెలుచుకుంటాయన్న నమ్మకం తనకు లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ సొంతంగా 120 స్థానాలు సాధిస్తే కేసీఆర్, అసదుద్దీన్‌ల అవసరమే ఉండదన్నారు. దేశాన్ని నడిపించే సామర్థ్యం, సత్తా ఉన్న నేతలు మోదీ, రాహుల్ మాత్రమే కాదని, చాలామంది ఉన్నారని అన్నారు. శనివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీకి ఒక్క లోక్‌సభ స్థానం కూడా రాదని జోస్యం చెప్పారు. పోటీ అంతా టీడీపీ, వైసీపీల మఽధ్యే ఉంటుందని, సరైన వ్యుహాంతో జగన్ వ్యవహరిస్తే మొత్తం సీట్లు ఆయనే గెలుచుకుంటారని అన్నారు. ఎంఐఎంకు టీఆర్‌ఎస్ పార్టీ బీఫ్ బిర్యానీ వడ్డిస్తుందన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపడ్డారు. మీ సిద్ధాంతాల ప్రకారం బిర్యాని అంటే ఇష్టపడకపోవచ్చు కానీ తన ఆహారపుటలవాట్లను ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలు ‘బీ’ టీమ్‌గా వ్యవహరిస్తున్నాయన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ‘ఎఫ్’ టీమ్‌లో ఉన్నామని, భవిష్యత్తులో తాము ‘ఏ’ టీమ్‌కు వెళతామని అన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని కేసీఆర్, కేటీఆర్ స్పష్టం చేశారన్నారు. ఇక గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గులామ్ అని వ్యాఖ్యానించారు. తన అహంకార పూరిత ధోరణితో హైదరాబాదీలను ఆజాద్ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment