మత దృష్టి కాదు, సామాజిక దృష్టి కావాలి! - BS Ramulu
22-04-2017 02:46:36
http://www.andhrajyothy.com/artical?SID=401978
ముస్లిం మతం పుచ్చుకున్న తర్వాత అందరూ సమానమే కనుక, వివక్ష లేదు కనుక, వారికి రిజర్వేషన్లు అక్కర్లేదు అని కొందరు హిందూ మతవాదులు ప్రచారం చేస్తుంటారు. ప్రతి కులం కూడా తనలో తాను, తన కొరకు తాను ఒక ప్రజాస్వామిక సోషలిస్టు సమాజాన్ని ఆచరిస్తూ వస్తున్నది. ఇతర కులాలతో కలిసి ఉన్నప్పుడే కులాధిక్యత, కుల వివక్ష మొదలైన అంశాలు ముందుకు వస్తాయి.
ముస్లిం సమాజం గురించి మత దృష్టితో కాకుండా, సామాజిక అభివృద్ధి దృష్టితో, విద్య, సామాజిక రంగాల్లో వెనుకబాటుతనం గురించి కొత్త దృష్టితో ఆలోచించడం అవసరం. ముస్లిం మతం పుచ్చుకున్న తర్వాత అందరూ సమానమే కనుక వివక్ష లేదు. కనుక వారికి రిజర్వేషన్లు అక్కర్లేదు అని కొందరు హిందూ మతవాదులు ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి హిందూ మతవాదులే హిందువుల మధ్య వర్ణ, కుల వివక్ష లేదని, హిందువులంతా ఒక్కటేనని గంభీరంగా ప్రకటిస్తూ నిస్సిగ్గుగా వివక్షను, వెలివేతను ఆచరిస్తుంటారు. అదే క్రమంలో ముస్లింలకు, హిందువులకు మధ్య వివక్ష, వెలివేత దృష్టి కొనసాగడం లేదని అంటుంటారు.
సమానత్వం విషయానికి వస్తే ప్రతి కులం కూడా తనలో తాను, తన కొరకు తాను ఒక ప్రజాస్వామిక సోషలిస్టు సమాజాన్ని ఆచరిస్తూ వస్తున్నది. అందువల్ల ఈ మేరకు కులం, ముస్లిం సమాజం తమలో తాము, తమ కొరకు తాము సోషలిస్టు సంబంధాలను కలిగి ఉంటాయి. తమలో తాము, తమ కొరకు తాము, ఇతరులతో తాము, ఇతరుల కొరకు తాము అనే అంశాలు సమాజంలో మొబిలిటీని, సోషల్ యాక్సెప్టెన్సీని, పరోపకారాన్ని, సహజీవనాన్ని, వాటి తీరుతెన్నులను, పరిణామ దశలను తెలియజేస్తాయి. ఇతరులతో తాము ఉన్నప్పుడు ఉండే సంబంధాల్లోనే కుల వివక్ష కొనసాగుతుంది. ఇతర కులాలతో కలిసి ఉన్నప్పుడే కులాధిక్యత, కుల వివక్ష మొదలైన అంశాలు ముందుకు వస్తాయి. పరస్పర సంబంధాల్లో, సహజీవనంలో ఉన్నప్పుడే హిందువులకు, ముస్లింలకు మధ్య అంతరాలు, వెలివేత, వివక్ష, సోషల్ యాక్సెప్టెన్స్‌కు సంబంధించిన అంశాలు ఉత్పన్నమవుతాయి.
స్వాతంత్య్రానంతరం ముఖ్యంగా ఇండియా నుండి పాకిస్థాన్, తూర్పు బెంగాల్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత ఇండియాలోని ముస్లింల పట్ల వ్యతిరేకత, వివక్ష, వెలివేత కొనసాగడం గమనించవచ్చు. నైజాం రాజ్యంలో 1946-–51 మధ్య రజాకార్ల పేరిట సాగిన దౌర్జన్యాలతో ముస్లిం సమాజం పట్ల అన్ని కులాలు భయభ్రాంతులయ్యారు. కాలక్రమంలో హిందూ సమాజం ద్వారా ముస్లింలు ఆధిక్యత నుంచి సోషల్ యాక్సెప్టెన్స్ నుంచి వెలివేతకు, వివక్షకు, నిరాదరణకు గురవుతూ వచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ స్థితి కొనసాగుతూ రావడానికి దేశ విభజనలో ముస్లిం మత ప్రసక్తి ఉండడం ఒక ప్రధాన చారిత్రక కారణం. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో అక్కడి ప్రజలు ఎంతమేరకు అభివృద్ధి అందుకున్నారో గానీ, ఇండియాలో ఉన్న ముస్లింపట్ల దేశ విభజన ఒక శాపంగా పరిణమించింది. అందుకే కొందరు సాహితీ వేత్తలు అదొక మాయని మచ్చగా, పుట్టుమచ్చగా ఆవేదన చెందారు. మరికొందరు ముస్లిం సాహితీవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు స్వాతంత్య్రానంతరం ముస్లింలు పంచముల వలె, అంటరానివారివలె ఆరవ వర్ణంగా చూడబడుతున్నామని అనేక రచనలు చేశారు. ఉర్దూ భాష క్రమంగా నిరాదరణకు లోనైంది. తెలుగులోనూ, హిందీలోనూ గల ఉర్దూ పదాలను పనిగట్టుకుని తొలగిస్తూ వస్తున్నారు. అలా ప్రతి విషయంలో వివక్ష పెరుగుతూ వచ్చింది. విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోతూ వచ్చారు.
1917లో ఏడవ నిజాంచే ప్రారంభించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ముస్లింలకు సేవలు అందించడంలో క్రమంగా వెనకబడిపోయింది. ఏడవ నిజాం తన మత సామరస్య దృక్పథంతో బెనారస్ కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి, డా. బి.ఆర్.అంబేడ్కర్ ఔరంగాబాద్ కాలేజికి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి సమానంగా పది లక్షల రూపాయల చొప్పున విరాళం ఇచ్చిన ఔదార్యం కొనియాడదగినది. హైదరాబాద్‌లో నిజాం కాలంలో సాధించిన విద్యాలయాలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, 1950 నాటికి ఉన్న ఇండియాలో అన్ని రంగాల్లో హైదరాబాద్ దక్కన్ ముందుంది అని చరిత్ర చెపుతున్నది. కానీ కాలక్రమంలో సామాజిక వర్గాల పొందిక మారిపోయింది. ముస్లింలు, బీసీలు వెనుకబడిపోయారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, చరిత్ర పరిణామంలోకి వెళితే, శతాబ్దాల కాలక్రమంలో రాజులు పేదలయ్యారు. గిరిజనులయ్యారు. సామాన్య మానవులు ప్రజాప్రతినిధులయ్యారు. మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయ్యారు. శతాబ్దాలుగా నాగపూర్, చంద్రపూర్ కేంద్రంగా కొనసాగిన గోండు రాజ్యం, బంజారాల, రాజపుత్రుల రాజ్యాలు, బిర్సాముండాల రాజ్యాలు కుప్పకూలిపోయాయి. వారు గిరిజనులుగా భారత రాజ్యాంగంలో వర్గీకరించబడ్డారు. ఒకప్పుడు రాజ్యాలేలిన మతాలు తమ ప్రాభవాలను కోల్పోయాయి. ఈ క్రమంలో ఎందరో హిందూ రాజులు, వారి వంశాలు ప్రజల్లో కలిసిపోయారు. ముస్లిం రాజవంశాలన్నీ జాతీయోద్యమం నుండి శిథిలమవుతూ ప్రజానీకంలో కలిసిపోయాయి.
శతాబ్దాల పరిణామంలో ఏకేశ్వరోపాసన స్వీకరించిన భారతీయ ప్రజలు ముస్లింలుగా, పేదలుగా కొనసాగుతూ ముస్లిం రాజవంశాల పతనంతో గిరిజనుల వలె దీన స్థితికి నెట్టివేయబడ్డారు. ఆయా రాష్ట్రాల్లో భాషా రాష్ట్రాల ఉద్యమాల కారణంగా తమ మాతృభాష కాని భాషలో, మీడియంలో చదవాల్సి రావడం వల్ల ముస్లింలకు తమదికాని కొత్త భాషలో భావ వ్యక్తీకరణ కష్టమైంది. పాఠ్యపుస్తకాలు, ఆధునిక విద్య అందుకోవడానికి ప్రాంతీయ భాషలను కానీ, ఇంగ్లీషును కానీ ఆశ్రయించడం వల్ల కొందరికే అవి అందుబాటులోకి వచ్చి కోట్లాది ప్రజలు 35 శాతం విద్యా, ఉద్యోగ అవకాశాల నుండి కాలక్రమంలో 3-5 శాతానికి పడిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికన్నా ఎక్కువ శిథిలమైనది ముస్లిం సామాజిక వర్గమే. ఆధిపత్య సామాజిక వర్గాల భాషలో, పాఠ్యాంశాలతో, పరిపాలనతో పోటీపడి ఎదగడం ముస్లింలకు సాధ్యం కాలేదు.
అలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాలక్రమంలో దశాబ్దాలు గడిచిన కొద్దీ నైజాం రాజ్యంలోని ముస్లింలు గత 40-–50 ఏళ్లుగా మాతృభాషకాని భాషలో చదువుకోలేక, ఆధునిక అభివృద్ధిలో, పరిశ్రమలో అవకాశాలు లేక అసంఘటిత చిన్నచిన్న వృత్తుల్లో పల్లీలు, సోడాలు, ఛాయ్ అమ్ముతూ, పాతసామాను సేకరిస్తూ, పాన్‌టేలాలు నడుపుతూ, సైకిల్, మోటార్ మెకానిక్‌లుగా బతుకులీడుస్తున్నారు. రిజర్వేషన్‌లు లేకపోవడంవల్ల నైజాం రాజ్యంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, రాజు, వైశ్య, కాపు తదితర అగ్రకులాలతో తమ మాతృభాష కాని భాషతో పోటీపడి విద్య, ఉద్యోగాల్లో రాణించలేక పూర్తిగా వెనకబడిపోయారు.
ఏ సామాజిక వర్గాన్నైనా మత దృష్టితో కాకుండా, వారి విశ్వాసాల దృష్టితో కాకుండా, సామాజిక దృష్టితో, భౌతిక దృష్టితో పరిశీలించడం లౌకిక దృష్టి. అదే లౌకిక, భౌతిక జీవన విదానం. జీవితంలో, సమాజంలో, భావజాల ప్రసారంలో రోజురోజుకూ పరస్పర సంబంధాలు, ప్రభావాలు పెరుగుతున్నాయి. వేల కులాలుగా, అనేక మతాలుగా చీలిపోయిన భారతీయ సమాజం సమైక్య భారతావనిగా రూపుదిద్దుకునే క్రమం కొనసాగుతున్నది. భారతీయ సమాజంలోని సమస్త అసమానతలను తొలగించడానికి భారత రాజ్యాంగం మౌలిక లక్ష్యాలను, ఆదేశిక సూత్రాలను, మార్గదర్శకాల అంతస్సారాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు నూతన ప్రయత్నాలు, నూతన కోణాలు, నూతన మార్గాలు అన్వేషించడం అవసరం.
బి.ఎస్. రాములు
చైర్మన్, బీసీ కమిషన్

No comments:
Post a Comment